Delhi: పొడవాటి జడ కత్తిరించినందుకు..బాధితురాలికి రూ.2కోట్ల పరిహారం

Sep 24 2021 @ 10:35AM

జాతీయ వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు

న్యూఢిల్లీ : జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ నగరంలోని ఐటీసీ మౌర్యా హోటల్ సెలూన్ లో ఓ మహిళకు ఉన్న పొడవాటి జుట్టును కత్తిరించినందుకు చికిత్స కోసం రూ.2కోట్ల పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రఖ్యాత వీఎల్‌సీసీ, పాంటీన్ జుట్టు ఉత్పత్తులకు మోడల్ అయిన ఓ మహిళ ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్ సెలూన్ కు రాగా అక్కడి బార్బర్లు పొడుగ్గా ఉన్న జట్టును పొరపాటున కత్తిరించారు. 

2018 వ సంవత్సరం ఏప్రిల్ 12వతేదీన ఓ ఇంటర్వ్యూ కోసం మహిళ జుట్టు కత్తిరింపు కోసం హోటల్ ఐటీసీ మౌర్యలోని సెలూన్‌కు వచ్చింది. తన రెగ్యులర్ హెయిర్ స్టైలిస్ట్ బదులుగా మరో హెయిర్‌స్టైలిస్ట్‌ను సెలూన్ వారు అందించారు. హెయిర్‌స్టైలిస్ట్ తన మొత్తం జుట్టును కత్తిరించడాన్ని గమనించిన మహిళ లబోదిబోమంది.అనంతరం సెలూన్ సిబ్బంది ఆమెకు ఉచిత హెయిర్ ట్రీట్మెంట్ అందించింది. హెయిర్ ట్రీట్మెంట్ కారణంగా ఆమె నెత్తి తీవ్రంగా కాలిపోయింది. దురద  నెత్తిమీద మంట ఏర్పడింది. జుట్టు చికిత్సలో ఉపయోగించే రసాయనం ఆమె నెత్తికి శాశ్వత నష్టం కలిగించిందని కమిషన్ కు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

హెయిర్ స్టయిలిస్టు నిర్లక్ష్యం కారణంగా మహిళ తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాధిత మహిళ ఉద్యోగంపై దృష్టి పెట్టలేకపోవడంతో చివరకు తన ఉద్యోగాన్ని కోల్పోయింది.కత్తిరింపు తర్వాత చిన్న జుట్టు మానసిక ఆందోళన కారణంగా మహిళ ఆదాయాన్ని కోల్పోయింది. సెలూన్ లో తప్పుగా జట్టును కత్తిరించడం వల్ల తాను మోడలింగ్ చేయలేక పోయానని, జుట్టు కత్తిరించడం వల్ల తాను మానసికంగా బాధపడ్డానని, టాప్ మోడల్ కావాలనే తన కల నెరవేరలేదని బాధిత మహిళ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. 

మహిళలు జట్టు విషయంలో జాగ్రత్తగా ఉంటారని, కాని తప్పుగా జుట్టును కత్తిరించి మోడల్ ఉపాధిని దెబ్బతీసినందున బాధిత మహిళకు రూ.2కోట్లను పరిహారంగా చెల్లించాలని జస్టిస్ ఆర్‌కె అగర్వాల్, డాక్టర్ ఎస్‌ఎమ్ కాంతికర్‌లు ఉత్తర్వులు జారీ చేశారు. జుట్టును పెంచడానికి గాను చికిత్సకు డబ్బు ఖర్చు అవుతుందని వారు పేర్కొన్నారు.


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.