ltrScrptTheme3

ప్రేమజంటకు సహకరించిందనే నెపంతో దారుణం.. చితక్కొట్టి, కళ్లలో యాసిడ్ పోసి చిత్రహింసలు..!

Sep 23 2021 @ 11:01AM

ప్రేమజంటకు సహకరించిందనే కారణంతో ఓ యువతికి చుక్కలు చూపించారు.. ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేశారు.. అనంతరం పోలీసులకు దొరికిపోయారు.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బరౌహా గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట ఇటీవల ఆ గ్రామం నుంచి పరారైంది. దీంతో యువతి తరఫు బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. ఆ యువతి వెళ్లిపోవడానికి సహకరించారనే నెపంతో తమ పొరుగింటి అక్కాతమ్ముళ్లపై పగబట్టారు. 


ఇవి కూడా చదవండి

ప్రియుడి కోసం నలుగురు యువతుల మధ్య ఫైటింగ్.. వీడియో వైరల్



ఆమె `నో` చెప్పిందని.. అతను ఎంతటి నీచానికి తెగించాడంటే..


బుధవారం ఉదయం వారితో గొడవకు దిగారు. అనంతరం వారిని గ్రామానికి సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరినీ అక్కడ చితక్కొట్టారు. అనంతరం యువతిని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో కళ్లలో యాసిడ్ పోసేశారు. అక్కణ్నుంచి వారిని ఊర్లోకి తీసుకొచ్చి పడేశారు. అనంతరం పరారయ్యారు. గ్రామస్తులు ఆ అక్కాతమ్ముళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 


తమ్ముడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతని సోదరి మాత్రం ప్రాణాలతో పోరాడుతోంది. ఒకవేళ ఆమె బతికినా శాశ్వతంగా చూపు కోల్పోనుంది. బాధిత మహిళ నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలించి ఐదు గంటల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.   

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.