మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్‌ హల్‌చల్.. చెప్పుతో కొట్టిన మహిళ..

ABN , First Publish Date - 2022-03-20T18:47:50+05:30 IST

అతను ఓ పోలీస్ కానిస్టేబుల్.. బాధ్యతాయుతంగా ఉంటూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వాడు..

మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్‌ హల్‌చల్.. చెప్పుతో కొట్టిన మహిళ..

అతను ఓ పోలీస్ కానిస్టేబుల్.. బాధ్యతాయుతంగా ఉంటూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వాడు.. అతడే మద్యం మత్తులో అదుపు తప్పి ప్రవర్తించాడు.. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. దీంతో ఆ మహిళ ధైర్యంగా ఎదురుతిరిగింది.. కర్రతో తనను కొడుతున్న కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టింది.. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు ఆమెకు అండగా నిలిచాడు.. ఉత్తరప్రదేశ్‌లోని చార్‌‌బాగ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. 


చార్‌ బాగ్‌ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మద్యం సేవించి ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టింది. దాంతో ఆ కానిస్టేబుల్ కర్ర తీసి ఆమెను కొట్టేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు ఆ కానిస్టేబుల్‌ను అడ్డుకున్నాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తనను కొట్టేందుకు వచ్చిన మహిళను ఆ కానిస్టేబుల్ తోసివేయగా ఆమె కిందపడిపోయింది. 


అనంతరం పైకి లేచిన సదరు మహిళ కానిస్టేబుల్‌పై చెప్పుతో దాడికి దిగింది. ఇంతలో ఇతర పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనను అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స‍్పందిస్తున్నారు.  



Updated Date - 2022-03-20T18:47:50+05:30 IST