భర్త చనిపోయిన రెండేళ్ల తర్వాత గర్భం దాల్చిన భార్య.. మనవళ్లు లేరని బాధపడుతున్న అత్తమామల కోరికను తీర్చిన కోడలు..

ABN , First Publish Date - 2022-06-17T21:29:22+05:30 IST

పెళ్లైన కొన్నాళ్లకే భర్త చనిపోవడంతో ఆమె ఒంటరైంది. తిరిగి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఆమె.. అత్తమామల యోగక్షేమాలు చూస్తూ జీవితం గడిపేయాలని నిర్ణయించుకుంది. అయితే.. వృద్ధ వయసులో మనవళ్లతో ఆడుకునే అదృష్టం తమకు లేదని

భర్త చనిపోయిన రెండేళ్ల తర్వాత గర్భం దాల్చిన భార్య.. మనవళ్లు లేరని బాధపడుతున్న అత్తమామల కోరికను తీర్చిన కోడలు..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన కొన్నాళ్లకే భర్త చనిపోవడంతో ఆమె ఒంటరైంది. తిరిగి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఆమె.. అత్తమామల యోగక్షేమాలు చూస్తూ జీవితం గడిపేయాలని నిర్ణయించుకుంది. అయితే.. వృద్ధ వయసులో మనవళ్లతో ఆడుకునే అదృష్టం తమకు లేదని బాధపడుతున్న అత్తామామలను చూసి ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే భర్త చనిపోయిన రెండేళ్ల తర్వాత గర్భం దాల్చింది. దీంతో తిరిగి ఆమె తన అత్తామామల కళ్లలో ఆనందాన్ని చూసింది. కాగా.. భర్త చనిపోయిన తర్వాత ఓ మహిళ గర్భం దాల్చడం ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..


రాజస్థాన్‌‌కు చెందిన ఓ మహిళకు ఓ ఆర్మీ జవాన్‌తో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ జైపూర్‌లోని రాజాపార్క్‌ ప్రాంతంలో నివసిస్తూ.. భవిష్యత్తును చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పిల్లలను కనాలని భావించారు. అయితే వారి కలలు కల్లలయ్యాయి. అనూహ్యంగా సదరు ఆర్మీ జవాను గుండె పోటుతో మృతి చెందడంతో.. భార్యతో సహా అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మరణానంతరం అత్తామామాలతో కలిసి ఉంటున్న ఆమె.. మనవళ్లు లేరని వాళ్లు బాధపడుతుండటాన్ని గ్రహించింది. ఈ క్రమంలోనే భర్త చనిపోకముందు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భద్రపరిచిన వీర్యంతో.. ఐవీఎఫ్ విధానంలో ఆమె గర్భం దాల్చింది. కోడలు తల్లైన విషయం తెలిసి.. ఆమె అత్తామామలు సంతోషం వ్యక్తం చేశారు. 



ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌లో ఈ విధానంలో పిల్లలు కనేందుకు చాలా మంది దంపతులు ముందుకు వస్తున్నారని అక్కడి వైద్యులు చెబుతున్నారు. విదేశాల నుంచి ఇండియాకు వచ్చి కూడా ఈ పద్ధతిలో తల్లిదండ్రులు అవుతున్నట్టు పేర్కొంటున్నారు. విదేశాల్లో ఈ పద్ధతిలో పిల్లలు కనడానికి చాలా ఖర్చవుతుందని.. ఇండియాలో అయితే తక్కువ మొత్తంలోనే మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. 

Updated Date - 2022-06-17T21:29:22+05:30 IST