ఆవుపేడ కుప్పలో భర్త శవం... తప్పకుండా బతుకుతాడని భార్యలో ఆశ.. ఆరు గంటల తర్వాత చూస్తే..

ABN , First Publish Date - 2021-10-27T03:55:57+05:30 IST

కర్వా చౌత్.. ఇది ఉత్తరాది వారికి ఎంతో ముఖ్యమైన పర్వదినం. ఈ రోజున మహిళలు తమ భర్తలు దీర్ఝాయుష్మంతులు అవ్వాలని కోరుకుంటూ రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రయ్యాక చంద్రుడిని చూసి ఉపవా దీక్ష ముగిస్తారు. కానీ..ఈ రోజునే ఓ మహిళ జీవితంలో అనూహ్యంగా చీకట్లు అలుముకున్నాయి.

ఆవుపేడ కుప్పలో భర్త శవం... తప్పకుండా బతుకుతాడని భార్యలో ఆశ.. ఆరు గంటల తర్వాత చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: కర్వా చౌత్.. ఇది ఉత్తరాది వారికి ఎంతో ముఖ్యమైన పర్వదినం. ఈ రోజున మహిళలు తమ భర్తలు దీర్ఝాయుష్మంతులు అవ్వాలని కోరుకుంటూ రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రయ్యాక చంద్రుడిని చూసి ఉపవా దీక్ష ముగిస్తారు. కానీ..ఈ రోజునే ఓ మహిళ జీవితంలో అనూహ్యంగా చీకట్లు అలుముకున్నాయి. ఆమె భర్తకు విద్యుదాఘాతంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. హరియాణా రాష్ట్రం సిర్సా జిల్లాలో ఆదివారం నాడు జరిగిందీ ఘటన. 


మండీ కాలన్‌వాలీ ప్రాంతానికి చెందిన జగ్జీత్ సింగ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఆదివారం ఉదయం స్నానం చేశాక అతడు తన తువాలును పక్కనే ఉన్న ఇనుప తీగపై ఆరేశాడు. అప్పటికే ఆ తీగలో విద్యుత్ ప్రవాహం ఉండటంతో అతడికి ఒక్కసారిగా షాక్ కొట్టి కిందపడిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. అయితే..పర్వదినాన తన భర్తకు ఇలా జరగడంతో అతడి భార్య ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అక్కడున్న వారిలో ఒకరు.. శవాన్ని ఆవుపేడలో పూడిస్తే తిరిగి బతికొచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఆమెలో ఏదో తెలియని ఆశ కలిగింది. 


దీంతో.. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న ఓ ప్రాంతంలో ఆవు పేడకుప్పను ఏర్పాటు చేసి భర్త శవాన్ని ఆమె కుటుంబసభ్యుల సాయంతో అందులో పూడ్చింది. అతడు లేచొస్తాడనుకుని ఆరు గంటల పాటు అక్కడే ఎదురు చూసింది. ఆ తరువాత భర్తలో కదలిక గుర్తించినట్టు ఆమె భ్రమపడిపోయి అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించింది. కానీ..అతడు ప్రాణాలతో లేడని వైద్యులు మళ్లీ చెప్పడంతో చివరికి కుటుంబసభ్యులు జగ్జీత్ సింగ్‌కు అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన స్థానికుల్లో విషాదాన్ని నింపింది. అయితే..ఈ విషయంపై పోలీసు కేసేదీ నమోదు కాలేదని సమాచారం. 

Updated Date - 2021-10-27T03:55:57+05:30 IST