బంగారం వ్యాపారి మిస్సింగ్.. కాల్ డేటాలో చివరగా ఓ మహిళకు ఫోన్.. పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీ చేస్తే..

ABN , First Publish Date - 2022-05-19T17:55:55+05:30 IST

అతను బంగారం వ్యాపారి.. 24 ఏళ్ల వయసున్న ఆ యువకుడు ఈ నెల 14వ తేదీన అదృశ్యమయ్యాడు..

బంగారం వ్యాపారి మిస్సింగ్.. కాల్ డేటాలో చివరగా ఓ మహిళకు ఫోన్.. పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీ చేస్తే..

అతను బంగారం వ్యాపారి.. 24 ఏళ్ల వయసున్న ఆ యువకుడు ఈ నెల 14వ తేదీన అదృశ్యమయ్యాడు.. అతడి గురించి తీవ్రంగా గాలించిన కుటుంబ సభ్యులు మూడ్రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు అతడి కాల్ డేటా గమనించగా అతను చివరగా ఓ మహిళతో మాట్లాడినట్టు తేలింది.. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి గాలింపులు చేపట్టారు.. చివరకు ఆమె ఇంటి పెరట్లో ఆ యువకుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. 

ఇది కూడా చదవండి..

పెళ్లయిన రెండో రోజే గుడికి వెళ్దామన్న భార్య.. సరేనని కార్లో తీసుకెళ్తే.. భర్త ఎదురుగానే..



బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన శివ్‌ కుమార్‌కు ఓ నగల దుకాణం ఉంది. అతడికి అదే ప్రాంతానికి చెందిన షాజహాన్ భార్య రౌనక్‌తో కొన్ని రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటికే ముగ్గురు పిల్లల తల్లి అయినా రౌనక్.. శివ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేనపుడు శివ్‌ను ఇంటికి పిలిచేది. ఈ నెల 14వ తేదీన కూడా అలాగే శివ్‌ను ఇంటికి పిలిచింది. అయితే ఆ రోజు శివ్‌తో రొమాన్స్ సాగిస్తూ భర్తకు దొరికిపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైన షాజహాన్.. భార్యను, శివ్‌ను చితక్కొట్టాడు. ఆ క్రమంలో శివ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారు తమ ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి శివ్‌ను పాతిపెట్టేశారు. రౌనక్ కూడా భర్తకు సహకరించింది. 


మూడ్రోజుల నుంచి శివ్‌ కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివ్ కాల్ డేటా, మొబైల్ లొకేషన్ ఆధారంగా షాజహాన్ ఇంటికి చేరుకున్నారు. భార్యాభర్తలను తమదైన శైలిలో విచారించారు. దీంతో వారు పోలీసులకు నిజం చెప్పేశారు. షాజహాన్ ఇంటి ఆవరణలో పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. షాజహాన్, రౌనక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2022-05-19T17:55:55+05:30 IST