పిజ్జా కావాలంటూ పోలీసులకు బస్సులోని మహిళ ఫోన్.. కాసేపటికి మరో ప్రయాణికుడి అరెస్ట్! అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-09T02:39:57+05:30 IST

పిజ్జా కావాలంటూ పోలీసులకు బస్సులోని మహిళ ఫోన్.. కాసేపటికి మరో ప్రయాణికుడి అరెస్ట్! అసలేం జరిగిందంటే..

పిజ్జా కావాలంటూ పోలీసులకు బస్సులోని మహిళ ఫోన్.. కాసేపటికి మరో ప్రయాణికుడి అరెస్ట్! అసలేం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: ఆమె బస్సులో ప్రయాణిస్తోంది. ఇంతలో ఆమె మనసులో ఏదో కీడు జరగబోతోందనే భయం మొదలైంది. వెంటనే పిజ్జా కావాలంటూ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్‌‌కు ఫోన్ చేసింది. కాల్ సెంటర్ అధికారి ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు..బస్సులోని మహిళ ‘అవును’ లేదా ‘కాదు’ అంటూ మాత్రమే సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేసింది. సీన్ కట్ చేస్తే కాసేపటి తరువాత ఆమె తోటి ప్రయాణికుడిని (40) పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా కన్‌ఫ్యూజింగా ఉంది కదూ..? అసలు ఏం జరిగిందంటే..


బాధితురాలికి ఆ ప్రయాణికుడి తీరు తొలి నుంచీ అనుమానాస్పదంగా అనిపించింది. అతడి వల్ల తనకు ప్రమాదం తప్పదని ఆమె భయపడింది. దీంతో.. అతడికి ఏ మాత్రం అనుమానం రాకుండా పోలీసులకు ఫోన్ చేసింది. అసలు విషయాన్ని దాచి పెట్టేందుకు.. పిజ్జా డెలివరీ చేస్తారా అంటూ వారితో సంభాషణ ప్రారంభించింది. అయితే..  పోలీసులకు ఫోన్ చేసి పిజ్జా అడగడంతోనే.. కాల్ సెంటర్‌లోని ఉద్యోగికి బస్సులోని సీన్ అర్థమైపోయింది. వెంటనే ఆమె.. ‘‘మీకు కొన్ని ప్రశ్నలు వేస్తా.. ‘అవును’ లేదా ‘కాదు’ అని మాత్రమే సమాధానం చెప్పండి అంటూ సంభాషణ కొనసాగించింది.  దీంతో.. బాధితురాలు కాల్‌సెంటర్ ఎక్జిక్యూటివ్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఇలాగే సమాధనం ఇచ్చింది. అంతేకాకుండా.. మధ్యమధ్యలో తన వివరాలు మెసేజీ రూపంలో కూడా షేర్ చేసింది.  వీటి ద్వారా బాధితురాలు సమస్యలో ఉందని అర్థం చేసుకున్న పోలీసులు.. బస్సు ఎక్కడుందో ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేసి అక్కడికి చేరుకున్నారు. అనంతరం..ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. 


ఇదంతా.. ఉత్తరఇంగ్లండ్‌లోని నార్త్‌యార్క్‌షైర్ కౌంటీలో ఇటీవల చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా.. విపత్కరపరిస్థితుల్లో ఉన్న  మహిళలు ఇలాంటి ఫోన్లు చేసి తమ సమస్యను ఎవ్వరికీ అనుమానం రాకుండా  తమకు చెప్పాలని సూచించారు. అంతేకాకుండా.. బాధితురాలి పిజ్లా అని మొదలెట్టగానే ఆమె సమస్యలో ఉందని గుర్తుపట్టిన కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అయితే.. పోలీసులకు ఇలాంటి ఫోన్లు రావడం అమెరికాలో సహజమే అయినప్పటికీ.. నార్త్‌యార్క్‌షైర్‌లో ఇదే తొలిసారి కావడంతో ఈ విషయం స్థానికంగా సంచలనానికి దారితీసింది.

Updated Date - 2022-04-09T02:39:57+05:30 IST