Uttar Pradesh: ఏడేళ్ల వయసులో తొలిసారి అత్యాచారం.. 28 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ!

ABN , First Publish Date - 2022-09-18T21:52:36+05:30 IST

తన భర్త ప్రోత్సాహంతో ఓ మహిళ ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. చిన్న వయసు నుంచి తానెదుర్కొన్న దారుణ పరిస్థితుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Uttar Pradesh: ఏడేళ్ల వయసులో తొలిసారి అత్యాచారం.. 28 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ!

తన భర్త ప్రోత్సాహంతో ఓ మహిళ ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. చిన్న వయసు నుంచి తానెదుర్కొన్న దారుణ పరిస్థితుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడేళ్ల వయసులో తనపై జరిగిన అత్యాచారం గురించి పోలీసులకు తెలిపింది. తన సవతి తండ్రి కుటుంబానికి చెందిన వ్యక్తులు చేసిన దారుణాల గురించి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అలీఘడ్‌లో ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు కేసు నమోదు అయింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: బైక్‌పై వృద్ధ దంపతులు.. భర్తను వెనుక కూర్చోపెట్టి బండి నడుపుతున్న బామ్మ స్టైల్‌కు నెటిజన్లు ఫిదా!


బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమె చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత ఆమె తల్లి రెండో వివాహం చేసుకుంది. సవతి తండ్రి తరఫు బంధువు ఆ బాలికను లైంగికంగా వేధించాడు. ఆ బాలికకు ఏడేళ్ల వయసు ఉండగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు కడుపు నొప్పి రావడంతో ఆ బాలిక తన తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. అయితే ఆ తల్లి ఆ బాలికకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చి సైలెంట్‌గా ఉండమని చెప్పింది. దాంతో మరో బంధువు కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఇద్దరూ కలిసి ఆమెకు 19 ఏళ్లు వచ్చే వరకు పలుసార్లు అత్యాచారం చేశారు. ఆ మహిళ 2011 జనవరిలో ఓ ఆర్మీ జవానును వివాహం చేసుకుంది. 


`పెళ్లయిన తర్వాత, నేను మా అమ్మను కలవడానికి ఇంటికి వెళ్లినప్పుడల్లా వారు నాపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, మళ్లీ అలా జరగనివ్వలేదు. అయితే, నేను వారిపై చర్య తీసుకునే ధైర్యాన్ని మాత్రం కూడగట్టుకోలేకపోయాను. చివరికి నాకు జరిగిన అన్యాయం గురించి భర్తకు తెలియజేశాను. అతను ఇచ్చిన భరోసాతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. మొదట పోలీసులు నా ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారు. అయితే జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశార`ని బాధితురాలు తెలిపింది. 

Updated Date - 2022-09-18T21:52:36+05:30 IST