మహిళ సంరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-03-09T05:56:27+05:30 IST

మహిళా సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదనీ, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ మహిళా దినోత్సవంగానే భావించి మహిళలను గౌరవించాలని ఎస్పీ కేకేఎన అన్బురాజన పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయ

మహిళ సంరక్షణ అందరి బాధ్యత
పోలీసు కాన్ఫరెన్స హాలులో మహిళాదినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న దృశ్యం

మహిళా రక్షణ కోసమే దిశ యాప్‌

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

అంత ర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ

కడప (క్రైం), మార్చి 8: మహిళా సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదనీ, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ మహిళా దినోత్సవంగానే భావించి మహిళలను గౌరవించాలని ఎస్పీ కేకేఎన అన్బురాజన పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పెన్నార్‌ పోలీసు కాన్ఫరెన్స హాలులో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి విశిష్ట సేవలందించిన మహిళలను ఎస్పీ ఘనంగా సత్కరించారు. ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా కేక్‌లు కట్‌ చేశారు. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌ చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్‌డెస్క్‌ ప్రారంభ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. కోవిడ్‌ విపత్కాలంలో కూడా పోలీసు యూనిట్‌ డాక్టర్‌ సమీరాభాను నిరంతరం సేవలందించడంతో పాటు కోవిడ్‌ బారిన పడ్డ సిబ్బందికి ఆమె అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. ప్రభుత్వం పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన దిశ యాప్‌ను ప్రతి మహిళా డౌనలోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఆపద సమయాల్లో ఎస్‌వోఎస్‌ బటన నొక్కితే క్షణాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షిస్తామన్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సైబర్‌ నేరాల బారిన పడ్డ వారు వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. కుటుంబ కలహాలు, మహిళా ఫిర్యాదులకు దిశ పోలీసుస్టేషనలో చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. మహిళలు అన్నిరంగాల్లో బాగా రాణిస్తున్నారని, మున్ముందు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Updated Date - 2021-03-09T05:56:27+05:30 IST