అనుమానంతో భర్తను వెంబడించిన భార్య.. బుల్లెట్ బండిపై ప్రియురాలితో అక్కడ అలా చూసి షాక్..

ABN , First Publish Date - 2021-10-18T21:25:27+05:30 IST

ఆ భార్యకు భర్త ప్రవర్తనపై అనుమానం కలిగింది. వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఏమైనా ఉందా? అనే కోణంలో భర్తను నిలదీసింది. దానికి సమాధానమిస్తూ అతడు అలాంటిదేమి లేదని కొట్టిపారేశాడు. కానీ అనుమానంగానే

అనుమానంతో భర్తను వెంబడించిన భార్య.. బుల్లెట్ బండిపై ప్రియురాలితో అక్కడ అలా చూసి షాక్..

భోపాల్: ఆ భార్యకు భర్త ప్రవర్తనపై అనుమానం కలిగింది. వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఏమైనా ఉందా? అనే కోణంలో భర్తను నిలదీసింది. దానికి సమాధానమిస్తూ అతడు అలాంటిదేమి లేదని కొట్టిపారేశాడు. కానీ అనుమానంగానే ఓ రోజు ఆమె భర్తను అనుసరిస్తూ వెనకాలే వెళ్లింది. అక్కడ అతడిని ప్రియురాలితో చూసి షాకైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. చివరికి ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..


భోపాల్‌లోని ఖానుగౌన్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఉర్బ షాహి భర్త తల్హా షమీమ్‌తో కలిసి ఉంటోంది. భర్త అంతకు ముందులా తనతో కలిసి ఉండడం లేదని, అతడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఉర్బ గమనించింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడేమోనని భావించి, భర్తను అడగింది. అపుడు తల్హా తనకు ప్రియురాలు లేదని కొట్టిపారేశాడు. తనకు ఏ అమ్మాయితో సంబంధం లేదని, తనెవరితో తిరగట్లేదని భార్యకు చెప్పాడు. కానీ అతడి మాటలు నమ్మని ఉర్బ ఆ రోజు నుంచి రహస్యంగా భర్తను అనుసరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఉర్బ తన చెల్లెలితో కలిసి భర్తను వెంబడిస్తూ వెళ్లింది. సుజ ఫిట్‌నెస్ సెంటర్‌కు చేరుకున్న ఉర్బకు అక్కడ తన భర్త కనిపించాడు. బుల్లెట్ బండిపై ప్రియురాలితో కలిసి సరదాగా గడుపుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వేరే అమ్మాయితో కలిసి ఉండడం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. భర్త ప్రియురాలి జుట్టు పట్టుకుని చెప్పుతో కొట్టింది. అడ్డుకోవడానికి వచ్చిన భర్త జుట్టు కూడా పట్టుకుని చితకబాదింది. గతంలో తన భర్తను వేరే అమ్మాయితో సంబంధం ఉందా? అని అడగ్గా తనను చితకబాదాడని, కానీ అదే ఇపుడు నిజమైందని ఉర్బ చెప్పింది. అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీశారు.    


ఈ ఘటనపై తల్హా ప్రియురాలు మాట్లాడుతూ.. సాయంత్రం తాను ఇతర వ్యక్తులతో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఉర్బ, ఆమె చెల్లెలు వచ్చారని.. తనపై దుర్భాషలాడుతూ తీవ్రంగా దాడి చేశారని చెప్పింది. ఈ దాడిలో తనకు అనేక చోట్ల గాయాలయ్యాయని వాపోయింది. తల్హా తనకు మిత్రుడని, తమ మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదని స్పష్టం చేసింది.ఈ ఘటనపై పోలీసులు కౌంటర్ కేసు నమోదు చేశామన్నారు. విచారణ ప్రారంభించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ నెల 15న తల్హా భార్య ఉర్బ వరకట్న వేధింపుల కింద భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.


Updated Date - 2021-10-18T21:25:27+05:30 IST