స్టాక్ మార్కెట్ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు.. ట్రేడింగ్ సీక్రెట్స్ చెబుతానని ఇంటికి పిలిచాడు.. వెళ్లిన బాధితురాలికి షాకింగ్ అనుభవం..

ABN , First Publish Date - 2022-03-07T05:40:04+05:30 IST

ఆమెకు అతను ఓ ట్రేడింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యాడు. ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని కాల్స్ చేయడం ప్రారంభించాడు.. ట్రేడింగ్ సీక్రెట్స్ చెబుతానని చెప్పి ఆమెను తన ఇంటికి...

స్టాక్ మార్కెట్ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు.. ట్రేడింగ్ సీక్రెట్స్ చెబుతానని ఇంటికి పిలిచాడు.. వెళ్లిన బాధితురాలికి షాకింగ్ అనుభవం..

ఆమెకు అతను ఓ ట్రేడింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యాడు. ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని కాల్స్ చేయడం ప్రారంభించాడు.. ట్రేడింగ్ సీక్రెట్స్ చెబుతానని చెప్పి ఆమెను తన ఇంటికి పిలిచాడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. నాలుగు రోజుల పాటు ఆమెను ఇంట్లో బంధించాడు.. చివరకు ఆమె ఎలాగోలా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. 


ఢిల్లీలోని కేశవపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళా వైద్యురాలు ఇటీవల స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెంచుకుంది. డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడులు పెట్టింది. ఓ ట్రేడింగ్ యాప్‌లో ఆమెకు బబ్లూ అనే వ్యక్తి పరిచయమ్యాడు. ఇద్దరూ మొబైల్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకునేవారు. తనకు పెళ్లి కాలేదని చెప్పి ఆమెను ప్రేమలోకి దించాడు. ట్రేడింగ్ సీక్రెట్స్ చెబుతానని చెప్పి ఆమెను తన గదికి పిలిచాడు. 


అతడి మాటలు నమ్మి బాధిత మహిళ అతడి రూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమెను బంధించిన నిందితుడు నాలుగు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె రహస్య భాగాలపై గాయాలు చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను ఆస్పత్రికి తరలించారు. మహిళ తప్పించుకుందని తెలిసి.. బబ్లూ కూడా పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు బబ్లూ కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2022-03-07T05:40:04+05:30 IST