పరిహారం చెక్కుల కోసం మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-26T06:44:28+05:30 IST

పరిహారం చెక్కులు ఇవ్వకుండా నిలిపివేయడంతో చర్లగూడెం రిజర్వాయర్‌ భూ నిర్వాసితురాలై న ఓ మహిళ శనివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దా ర్‌ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య కు యత్నించింది.

పరిహారం చెక్కుల కోసం మహిళ ఆత్మహత్యాయత్నం
తహసీల్దార్‌ కార్యాలయ గేటుమూసి ధర్నా చేస్తున్న చర్లగూడెం భూనిర్వాసితులు

తహసీల్దార్‌ వెళ్లకుండా గేటువేసి నిరసన వ్యక్తం చేసిన భూనిర్వాసితులు

మర్రిగూడ, జూన్‌ 25: పరిహారం చెక్కులు ఇవ్వకుండా నిలిపివేయడంతో చర్లగూడెం రిజర్వాయర్‌ భూ నిర్వాసితురాలై న ఓ మహిళ శనివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దా ర్‌ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య కు యత్నించింది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలం చర్లగూడెంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో ముం పునకు గురవుతున్న 231 ఇళ్లకు సంబంధించిన పరిహారం చెక్కులను నిర్వాసితులకు దేవరకొండ ఆర్డీవో రెండు రోజులుగా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పంపిణీచేస్తున్నారు. శనివారం ఉదయం 10.30 నుంచి చెక్కులు పంపిణీ చేశారు. అయితే వల్లపు హైమతోపాటు వల్లపు జంగమ్మ, వల్లపు ఆంజనేయులు, వల్లపు శ్రీను, వల్లపు వెంకటయ్య, వల్లపు యాదగిరి, వల్లపు పద్మకు మంజూరైన చెక్కులను మాత్రం పంపిణీ చేయాలేదు. దీంతో తమ కు చెక్కు నిలుపుదల చేయడం ఏంటని పలువురు నిర్వాసితులతో కలిసి సాయంత్రం 5.30గంటల సమయంలో తహసీల్దార్‌ కార్యాలయ గేటు వేసి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ సంఘమిత్ర ఇంటికి వెళ్లకుండా కార్యాలయంలో గేటు ఎదుట బైఠాయించారు. అదే సమయంలో నిర్వాసితులైన వల్లపు హైమా తనకు రావలసిన చెక్కును నిలుపుదల చేశారని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. అక్కడే ఉన్న ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి దీన్ని గమనించి మహిళ నుంచి పెట్రోల్‌ బాటిల్‌ను లాక్కునేందుకు యత్నించగా, అక్కడే ఉన్న భూనిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తరువాత పెట్రోల్‌ బాటిల్‌ను ఎస్‌ఐ లాక్కున్నారు. తమ ఇళ్లు రిజర్వాయర్‌లో పోతున్నాయని, పరిహారానికి అర్హులుగా అధికారులు తెల్చగా, తమ పేరున చెక్కు కూడా వచ్చిందని, అయినా అధికారులు ఇవ్వకుండా అన్యా యం చేస్తున్నారు, న్యాయం జరిగేంతవరకు తహసీల్దార్‌ను వెళ్లనిచ్చేది లేద ని నిర్వాసితులు మొండికేశారు. దీంతో స్పందించిన తహసీల్దార్‌ సంఘమిత్ర ఆర్డీవో గోపిరాంతో ఫోన్‌లో మాట్లాడారు. చెక్కు నిలుపుదలకు కారణా లు తెలుసుకొని ఆదివారం సర్వే, విచారణ చేయిస్తామని ఆర్డీవో గోపిరాం తెలిపినా నిర్వాసితులు వినలేదు. అనంతరం తహసీల్దార్‌ జోక్యం చేసుకొని తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు ధర్నా విరమించారు. కాగా,  వల్లపు హైమ తదితరులు గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఇంటిని నిర్మించుకున్నారు. వీరికి భూపరిహారం గతం లో వచ్చింది. అయితే ఇంటికి సంబంధించిన పరిహారం రాలేదు. అయితే ఇళ్ల పరిహారానికి వీరిని అర్హులుగా అధికారులు గతంలో తేల్చగా, వీరి పేరు న చెక్కు సైతం వచ్చింది. కాగా, గతంలోనే వీరు పరిహారం చెక్కు తీసుకున్నారనే కారణంతో ఇంటి చెక్కును నిలుపుదల చేసినట్టు సమాచారం. 

Updated Date - 2022-06-26T06:44:28+05:30 IST