ఒకరోజు హోంమంత్రిగా మహిళా కానిస్టేబుల్

ABN , First Publish Date - 2021-03-08T20:58:46+05:30 IST

సోమవారం భోపాల్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘మీనాక్షి ఈరోజు హోంమంత్రిగా ఉంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా

ఒకరోజు హోంమంత్రిగా మహిళా కానిస్టేబుల్

భోపాల్: మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా కానిస్టేబుల్‌ మినాక్షి వర్మని ఒక రోజు హోంమంత్రిగా నియమించారు. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్వయంగా తన కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి ఆమెకు తన బాధ్యతలను ఒకరోజు బదిలీ చేశారు. ఈరోజు మినాక్షి చెప్పినట్లుగానే హోంశాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.


సోమవారం భోపాల్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘మీనాక్షి ఈరోజు హోంమంత్రిగా ఉంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. నా కుర్చీని మీనాక్షికి ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను. ఈ ఒక్కరోజు హోంశాఖ పూర్తిగా మీనాక్షి ఆదేశాల మేరకే పని చేస్తుంది’’ అని హోంమంత్రి నరోత్తమ్ అన్నారు.


ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు బరేలీ ఎయిర్‌పోర్టు ప్రారంభంకానుంది. ఈ ఎయిర్ పోర్టులో పైలెట్లు మొదలుకొని క్రూ సిబ్బంది వరకూ అందరూ మహిళలే ఉండనున్నారు.

Updated Date - 2021-03-08T20:58:46+05:30 IST