Watch Video: ఈ-రిక్షా డ్రైవర్‌ను 17 సార్లు చెంపదెబ్బ కొట్టిన మహిళ.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-14T01:19:11+05:30 IST

స్మార్ట్‌ఫోన్ (Smartphone), ఇంటర్నెట్ (Internet) అందరికీ అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. అది మంచి కానీ, చెడు గానీ..

Watch Video: ఈ-రిక్షా డ్రైవర్‌ను 17 సార్లు చెంపదెబ్బ కొట్టిన మహిళ.. కారణం ఏంటంటే..

నోయిడా: స్మార్ట్‌ఫోన్ (Smartphone), ఇంటర్నెట్ (Internet) అందరికీ అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. అది మంచి కానీ, చెడు గానీ సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అయి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా.. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటంటే.. నోయిడాకు (Noida) చెందిన ఒక ఈ-రిక్షా డ్రైవర్ (E-Rickshaw Driver) పొరపాటున ఒక మహిళ కారు వెనుక భాగాన్ని ఢీ కొట్టాడు. నోయిడా పేస్ 2, సెక్టార్ 10లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కారు వెనుక భాగం కొంత గీసుకుపోయినట్టు అయింది. అంతే తప్ప.. కారు వెనుక భాగం అంతగా ఏమీ డ్యామేజ్ కాలేదు. అయితే.. ఈ-రిక్షా తన కారును ఢీ కొట్టడంతో శివాలెత్తిపోయిన ఆ కారు మహిళా యజమాని ఆ ఈ-రిక్షా డ్రైవర్‌పై చేయి చేసుకుంది.



కారు దగ్గర నుంచి ఈ-రిక్షా దగ్గరకు, ఈ-రిక్షా దగ్గర నుంచి కారు వద్దకు తిప్పుతూ చెంప దెబ్బలు కొట్టింది. 17 సార్లు (Slaps 17 Times) అతనిపై చెంప దెబ్బలతో విరుచుకుపడింది. ఈ ఘటనను అక్కడున్న వారిలో ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన మెజార్టీ నెటిజన్లు ఆ మహిళ తీరును తప్పుబడుతున్నారు. నష్టం జరిగితే చెల్లించమని అడగాలి గానీ అలా అమానుషంగా చేయి చేసుకోవడం ఏంటని ఆ మహిళ తీరును ఎండగట్టారు. ఆ మహిళపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-08-14T01:19:11+05:30 IST