Woman Cuts Lover`s Penis: ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన మహిళ.. ఆమె ఆగ్రహం వెనుక ఉన్న కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-08-22T00:54:23+05:30 IST

మద్యానికి బానిసై తనను ఇబ్బందులు పెడుతున్నాడనే కారణంతో ఆ మహిళ తన భర్తను వదిలేసింది.

Woman Cuts Lover`s Penis: ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన మహిళ.. ఆమె ఆగ్రహం వెనుక ఉన్న కారణమేంటంటే..

మద్యానికి బానిసై తనను ఇబ్బందులు పెడుతున్నాడనే కారణంతో ఆ మహిళ తన భర్తను వదిలేసింది.. కూతురితో కలిసి బయటకు వెళ్లిపోయింది.. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. రెండేళ్లుగా అతడితోనే కలిసి జీవిస్తోంది.. ఆ వ్యక్తి తన ప్రియురాలి కూతురిపై కన్నేశాడు.. బుధవారం ఆమె బయటి నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె కూతురిపై అత్యాచారానికి ఒడిగడుతున్నాడు.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ కూరగాయలు కోసే కత్తితో ప్రియుడి పురుషాంగాన్ని కోసేసింది. 


ఇది కూడా చదవండి..

Domino's compensation: ఇంటర్వ్యూకు వచ్చిన మహిళకు రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించిన డోమినోస్.. కారణమేంటో తెలిస్తే షాక్!


ఉత్తరప్రదేశ్(UttarPradeshలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 36 ఏళ్ల మహిళ.. మద్యానికి బానిసైన తన భర్తను వదిలేసింది. 32 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని రెండేళ్లుగా అతడితోనే సహజీవనం చేస్తోంది. ఆ మహిళకు 14 ఏళ్ల కూతురు ఉంది. బుధవారం ఆ మహిళ కూలి పని చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లేసరికి ప్రియుడు ఆమె కూతురిపై అత్యాచార యత్నం చేస్తున్నాడు. ఆ మహిళ వెళ్లి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే చంపేస్తానని బెదిరించాడు. 


తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ వంట గదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తెచ్చి ప్రియుడి పురుషాంగాన్ని (Woman Cuts Lover`s Penis) కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో చుట్టు పక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని లక్నోలోని ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచార యత్నం చేసిన ఆ వ్యక్తిపై, అతడిని గాయ పరిచిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.  

Updated Date - 2022-08-22T00:54:23+05:30 IST