చిన్న సర్జరీ సరిపోతుందనుకున్నారు.. కానీ చివరకు కోమాలోకి.. ఏడేళ్లుగా ఆమెకు ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్.. ఎంత ఖర్చు అయిందంటే..

ABN , First Publish Date - 2022-05-26T22:28:42+05:30 IST

ఢిల్లీకి చెందిన ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లింది.. అక్కడ కేరళకు చెందిన తన సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకుంది..

చిన్న సర్జరీ సరిపోతుందనుకున్నారు.. కానీ చివరకు కోమాలోకి.. ఏడేళ్లుగా ఆమెకు ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్.. ఎంత ఖర్చు అయిందంటే..

ఢిల్లీకి చెందిన ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లింది.. అక్కడ కేరళకు చెందిన తన సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఆ జంటకు పిల్లలు కలగలేదు.. 2015 అక్టోబర్‌లో ఆమెకు కడుపు నొప్పి ప్రారంభమైంది.. చిన్న సర్జరీ చేయించుకోవాలనుకుని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో జాయిన్ అయింది.. అప్పట్నుంచి ఆమె బయటకు రాలేదు.. కోమాలోకి వెళ్లిన ఆమె ఏడేళ్లుగా అదే హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతోంది.. చివరకు మంగళవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయింది. ఏడేళ్ల పాటు చికిత్స అందించినందుకు రూ.9.5 కోట్లు బిల్ అయింది. 

ఇది కూడా చదవండి..

23 ఏళ్లుగా శాండ్‌విచ్, చిప్స్ మాత్రమే తింటూ బతుకుతున్న యువతి.. చివరకు విసుగొచ్చి ఆమె తల్లిదండ్రులు ఏం చేశారంటే..


ఢిల్లీకి చెందిన పూనమ్ రాణా (35) ఏడేళ్లుగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటూ మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచింది. బెంగళూరలోని యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాయిన్ అయిన పూనమ్ తన సహోద్యోగి అయినా రెజిష్ నాయర్‌ను వివాహం చేసుకుంది. 2015 అక్టోబర్‌లో ఆమెకు కడుపు నొప్పి ప్రారంభమైంది. చిన్న సర్జరీ చేస్తే నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో మణిపాల్ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. అయితే సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది.


ఏడేళ్లుగా ఆమెను మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎమ్ఐసీయూ)లో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. అయినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరకు మంగళవారం మధ్యాహ్నం ఆమె మరణించింది. కాగా, ఇన్ని రోజులూ చికిత్స అందించినందుకు హాస్పిటల్ యాజమాన్యం రూ.9.5 కోట్లు బిల్ వేసింది. ఇప్పటికే రిజేష్ రూ.2 కోట్లు చెల్లించాడు. ముంబై హాస్పిటల్‌లో 42 సంవత్సరాలు చికిత్స పొంది 2015లో మరణించిన నర్సు అరుణ్ షాన్‌బాగ్ తర్వాత అంత కాలం చికిత్స అందుకున్న వ్యక్తి పూనమ్ కావడం గమనార్హం.

Updated Date - 2022-05-26T22:28:42+05:30 IST