ప్రైవేట్‌ ఆసుపత్రిలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-07-24T06:15:45+05:30 IST

పాముకాటుతో చికిత్స పొందుతున్న చెల్లెలు కొ డుకుని చూడడానికి వచ్చిన ఓ మహిళ ఆస్పత్రిలో నీరు అనుకొని యాసిడ్‌ తాగి మృతి చెందింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని జయ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

ప్రైవేట్‌ ఆసుపత్రిలో మహిళ మృతి

 నీళ్లు అనుకొని యాసిడ్‌ తాగిన మహిళ

  జయ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆరోపణ

 ఆస్పత్రి ఎదుట కుటుంబీకుల ఆందోళన

పెద్దబజార్‌, జూలైౖ 23: పాముకాటుతో చికిత్స పొందుతున్న చెల్లెలు కొ డుకుని చూడడానికి వచ్చిన ఓ మహిళ ఆస్పత్రిలో నీరు అనుకొని యాసిడ్‌ తాగి మృతి చెందింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని జయ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్‌ మండల కేంద్రానికి చెందిన సాయికుమార్‌కు రెండు రోజుల క్రితం పాముకాటు వే సింది. దీంతో నగరంలోని జయ ప్రైవేట్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సాయికుమార్‌ను చూసేందుకు వేల్పూర్‌ మండలంలోని మోతె గ్రామానికి చెందిన అతని పెద్దమ్మ సాయమ్మ వచ్చింది. ఆస్పత్రి ఆవరణలో అన్నం తిని బాత్రుం వద్దకు వెళ్లి చేతులు, కాళ్లు కడుక్కుంది. నీరు అనుకుని అక్కడే ఉన్న బాటిల్‌లోని యాసిడ్‌ను సాయమ్మ తాగింది. దీంతో గంట తర్వాత గొంతులో నొప్పి రావడంతో జయ ఆసుపత్రి వైద్యులు ఆమెను పరిశీలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో సాయమ్మ మృతిచెందింది. జయ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. అనంత రం కుటుంబీకులు ఒకటవ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-07-24T06:15:45+05:30 IST