ఆస్పత్రిలో యువతి మృతి.. రోడ్డు పక్కన పడిపోతే తీసుకొచ్చానన్న కుర్రాడు.. పోలీసుల ఎంట్రీతో బయటపడిన భారీ స్కెచ్..!

ABN , First Publish Date - 2021-12-21T06:37:09+05:30 IST

ఆరోగ్యం బాగా క్షీణించిన ఒక యువతిని ఒక యువకుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించగా.. ఆ యువకుడు తనకు ఆమెతో ఏ సంబంధం లేదని.. ఆమె రోడ్డుపై పడి ఉంటే తీసుకొచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. ఆస్పత్రి వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు చేసిన విచారణలో షాకింగ్ విషయం...

ఆస్పత్రిలో యువతి మృతి.. రోడ్డు పక్కన పడిపోతే తీసుకొచ్చానన్న కుర్రాడు.. పోలీసుల ఎంట్రీతో బయటపడిన భారీ స్కెచ్..!

ఆరోగ్యం బాగా క్షీణించిన ఒక యువతిని ఒక యువకుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించగా.. ఆ యువకుడు తనకు ఆమెతో ఏ సంబంధం లేదని.. ఆమె రోడ్డుపై పడి ఉంటే తీసుకొచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. ఆస్పత్రి వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు చేసిన విచారణలో షాకింగ్ విషయం తెలిసింది.


పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా పరిధిలోని షాహ్పానీ గ్రామానికి చెందిన లీలా(పేరు మార్చబడినది) అనే యువతికి అదే గ్రామానికి చెందిన అంకిత్ కుమార్ అనే యువకుడితో నాలుగేళ్లగా పరిచయం ఉంది. ఇటీవల లీలా గర్భవతి కావడంతో అంకిత్ కుమార్ ఆమెను మమతా అనే ఒక నర్సు వద్దకు తీసుకు పోయాడు. మమత నర్సు రూ.30,000 డబ్బు తీసుకొని మరో నర్సు కవిత సహాయంతో లీలాకు గర్భస్రావం(అబార్షన్) చేసి పిండాన్ని తొలగించారు. కానీ ఆ తరవాత లీలాకు అధిక రక్తాస్రావం అవుతుండడంతో నర్సులు కంగారు పడి లీలాను ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు.


ఆ సమయంలో అంకిత్ కుమార్ లీలాను తీసుకొని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ లీలా చికిత్స పొందుతూ మరణించింది. ఆ తరువాత ఆస్పత్రి వారికి అంకిత్ కుమార్.. తనకు లీలాకు సంబంధం లేదని, ఏదో రోడ్డుపై పడి ఉంటే తీసుకొని వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. ఆస్పత్రి వారు పోలీసులకు లీలా గురించి సమాచారం అందించారు. పోలీసులు లీలా గురించి మరింతగా విచారణ చేసి అసలు నిజం తెలుసుకున్నారు. అంకిత్ కుమార్‌ను పట్టుకొని గట్టిగా ప్రశ్నించగా.. అతను లీలా అబార్షన్ గురించి చెప్పేశాడు. దీంతో పోలీసులు అక్రమంగా గర్భస్రావం చేసిన ఇద్దరు నర్సులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.


Updated Date - 2021-12-21T06:37:09+05:30 IST