శ్మశానంలో షాకింగ్ సీన్.. అస్థిపంజరంతో ఆడుతున్న మహిళ.. కారులో వెళ్తుండగా చూసి అవాక్కైన ప్రజలు

Sep 18 2021 @ 16:10PM

ఇంగ్లండ్‌లోని ఓ స్మశానంలో ఓ మహిళ చేష్టలకు స్థానికులంతా విస్తుపోయారు. నన్‌లా బట్టలు ధరించి స్మశానంలోని అస్థిపంజరంతో డ్యాన్స్ చేస్తున్న మహిళ అందరికీ షాకిచ్చింది. ఆ దారిలో వాహనాల్లో వెళ్తున్న వారందరూ ఆ దృశ్యాలను చూసి షాకయ్యారు. ఓ వ్యక్తి ఆమె ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


ఇవి కూడా చదవండి

రాజస్థాన్‌లో ప్రియుడి శవం.. మధ్యప్రదేశ్‌లో ప్రేయసి మృతదేహం..రెడ్ సిగ్నల్ పడగానే రోడ్డుపైకి దూసుకొచ్చి ఓ యువతి అనూహ్య చర్య..

మొదట ఆమెను అలా చూసినవారందరూ ఏదో ప్రాంక్ లేదా ఏదో షూటింగ్ అనుకున్నారు. అయితే అక్కడ అలాంటి ఆనవాళ్లేవీ లేకపోవడంతో ఆమె మానసిక వ్యాధిగ్రస్తురాలని భావిస్తున్నారు. ఆమె గురించి ఎలాంటి సమాచారమూ లభించలేదు. నిజానికి ఆ స్మశానం 50 సంవత్సరాల నుంచి ఉపయోగంలో లేదని, అక్కడ ఎంతో మంది ప్రముఖులను ఖననం చేశారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ అలా డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరోనని అందరూ చర్చించుకుంటున్నారు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.