33 ఏళ్ల మహిళ కారులో వెళ్తోంటే చెక్ చేసిన పోలీసులు.. డిక్కీలోని ఓ మూటలో ఏమున్నాయో చూసి అంతా షాక్..!

Jul 31 2021 @ 13:29PM

ఓ మహిళ కారులో వెళ్తుండగా సాధారణ తనిఖీల్లో భాగంగా చెక్ చేసిన పోలీసులు డిక్కీ ఓపెన్ చేశారు.. అందులో ఉన్న మూటలను విప్పి చూసి షాకయ్యారు.. అందులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి నివ్వెరపోయారు.. కొన్ని నెలల క్రితం ఇద్దరు చిన్నారులను చంపేసిన మహిళ ఆ మృతదేహాలను కారు డిక్కీలోనే ఉంచి తిరుగుతోందని తెలుసుకున్నారు.. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఈ ఘటన జరిగింది. 


నికోల్ జాన్సన్ అనే మహిళ కారును బుధవారం బాల్టిమోర్ ప్రాంతంలో పోలీసులు ఆపారు. అమె దగ్గర ఉండాల్సిన పేపర్లు లేకపోవడంతో కారును చెక్ చేశారు. డిక్కీ ఓపెన్ చేయగా అందులోని రెండు మూటలు కనిపించాయి. అందులో కుళ్లిపోయిన స్థితిలో ఇద్దరు చిన్నపిల్లల మృతదేహాలు కనిపించాయి. దీంతో షాకైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. 


ఆ మృతదేహాలు తన మేనకోడలు, మేనల్లుడివని నికోల్ అంగీకరించింది. చిన్న గొడవ కారణంగా సంవత్సరం క్రితం తన మేనల్లుడి తలపై ఇనుప రాడ్‌తో కొట్టి చంపేశానని, శవాన్ని ఏం చేయాలో తెలియక కారు డిక్కీలో పడేశానని చెప్పింది. మూడు నెలల అనంతరం మేనకోడలిని కూడా చంపేసి అక్కడే పడేశానని తెలిపింది. ఆ మృతదేహాలతోనే కొన్ని నెలలుగా కారులో ప్రయాణిస్తున్నానని చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...