పాతిక లక్షలు గెలిచినట్లు చెప్పడంతో సంతోషించిన యువతి.. ప్రైజ్ మనీ కోసం 70 వేలు కట్టిన తర్వాత..

ABN , First Publish Date - 2022-06-01T08:40:01+05:30 IST

అప్పుడప్పుడూ మనందరికీ ఫలానా లాటరీలో మీకు కోటి రూపాయలు వచ్చాయంటూ కొన్ని దొంగ మెసేజిలు వస్తుంటాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలా వచ్చిన మెసేజ్ వల్ల ఒక యువతి రూ.70 వేలు పోగొట్టుకుంది. విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే తిట్టిపోస్తారని భయపడి...

పాతిక లక్షలు గెలిచినట్లు చెప్పడంతో సంతోషించిన యువతి.. ప్రైజ్ మనీ కోసం 70 వేలు కట్టిన తర్వాత..

అప్పుడప్పుడూ మనందరికీ ఫలానా లాటరీలో మీకు కోటి రూపాయలు వచ్చాయంటూ కొన్ని దొంగ మెసేజిలు వస్తుంటాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలా వచ్చిన మెసేజ్ వల్ల ఒక యువతి రూ.70 వేలు పోగొట్టుకుంది. విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే తిట్టిపోస్తారని భయపడి, దొంగతనం జరిగినట్లు నాటకమాడింది. ఈ ఘటన బిహార్‌లోని జహానాబాద్‌లో వెలుగు చూసింది. 


స్థానికంగా రామ్‌నగర్ విష్ణుగంజ్ ప్రాంతంలో నివశించే అంజలీ కుమారి అనే యువతి.. తన చేతుల్లో నుంచి రూ.70 వేలు దొంగలు ఎత్తుకుపోయారని గొడవ చేసింది. దీంతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ దొంగతనం జరిగినట్లు ఆమె చెప్తున్న ప్రాంతంలో ఎవరూ అలా జరగడం చూడలేదని అన్నారు. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి అంజలీ కుమారిని గట్టిగా ప్రశ్నించారు. దాంతో ఆమె జరిగింది మొత్తం చెప్పేసింది. 


కొన్ని రోజుల క్రితం తనకు ఎవరో వాట్సాప్ కాల్ చేశారని, లాటరీలో రూ.25 లక్షలు గెలిచినట్లు  చెప్పారని వెల్లడించింది. అంత పెద్ద మొత్తం వస్తుందని తెలిసి ఆశ పడి, వాళ్లు చెప్పినట్లే ఒక కెనరా బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు జమ చేశానని తెలిపింది. తర్వాత మళ్లీ కాల్ చేసిన మోసగాడు మరో రూ.20 వేలు అదే ఖాతాలో వేయమని చెప్పడంతో ఆ సొమ్ము కూడా చెల్లించింది. ఆ తర్వాత అతను ఫోన్ చేయలేదు. ఆమె ఫోన్ చేసినా కలవడం లేదు. దాంతో తను మోసపోయినట్లు ఆమె అర్థం చేసుకుంది. కుటుంబసభ్యులకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందని భయంతో దొంగతనం జరిగినట్లు నాటకమాడింది.

Updated Date - 2022-06-01T08:40:01+05:30 IST