Viral Video: రోడ్డుపై ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లి.. చివరికి ఇలా ప్రాణాలతో బయటపడింది!

ABN , First Publish Date - 2022-04-23T23:34:31+05:30 IST

మొబైల్ ఫోన్‌లు ప్రస్తుతం మన జీవితాల్లో ఒక భాగం అయ్యాయి. దాదాపు అన్ని పనులు ఫోన్‌ల ద్వారానే పూర్తవుతున్నాయి. అయితే పనులను ఈజీ చేసే ఈ ఫోన్‌లు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా

Viral Video: రోడ్డుపై ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లి.. చివరికి ఇలా ప్రాణాలతో బయటపడింది!

ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ ఫోన్‌లు ప్రస్తుతం మన జీవితాల్లో ఒక భాగం అయ్యాయి. దాదాపు అన్ని పనులు ఫోన్‌ల ద్వారానే పూర్తవుతున్నాయి. అయితే పనులను ఈజీ చేసే ఈ ఫోన్‌లు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే బిహార్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే..



ప్రస్తుత సమాజంలో ప్రజలు ఫోన్‌ల ద్వారానే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఏ విషయాన్నైనా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోవడం లేదు. తాజాగా పాట్నాకు చెందిన ఓ మహిళ కూడా ఇలానే చేసింది. ఫోన్‌లో మాట్లాడుతూ.. రోడ్డుపై నడిచింది. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్‌ను ఆమె పట్టించుకోలేదు. దీంతో ఆమె మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. వెంటనే స్థానికులు స్పందించి.. ఆమెను రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. అందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  




Updated Date - 2022-04-23T23:34:31+05:30 IST