Heart touching video: డ్యాన్స్ చేస్తూ పడిపోయిన యువతి.. ఆ తర్వాత ఆమె తండ్రి ఏం చేశాడంటే.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో!

ABN , First Publish Date - 2022-07-24T22:18:45+05:30 IST

దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లిదండ్రులను సృష్టించాడు అంటుంటారు.. అవును.. తల్లిదండ్రులు పిల్లలను కనడమే కాదు..

Heart touching video: డ్యాన్స్ చేస్తూ పడిపోయిన యువతి.. ఆ తర్వాత ఆమె తండ్రి ఏం చేశాడంటే.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో!

దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లిదండ్రులను సృష్టించాడు అంటుంటారు.. అవును.. తల్లిదండ్రులు పిల్లలను కనడమే కాదు.. వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుని పెంచి పెద్ద చేస్తారు.. వారు సాధించిన విజయాలు చూసి మురిసిపోతారు.. వారికి చిన్న కష్టం కలిగినా తల్లడిల్లిపోతారు.. పిల్లలు ఎంత పెద్ద వారైనా వారికి రక్షణ కవచంలా ఉండాలని తపిస్తారు.. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో కూతురి పట్ల ఓ తండ్రి అనురాగం కళ్లకు కట్టినట్టు కనిపించింది.. తల్లిదండ్రుల దినోత్సవం (Parents Day) సందర్భంగా ఆ వీడియోపై ఓ లుక్కేద్దామా.. 


ఆ వీడియోను మోడల్ Anisha Nisha అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రకారం.. ఆ యువతి ఫ్యామిలీ ఫంక్షన్‌లో మరో యువతితో కలిసి డ్యాన్స్ చేస్తోంది. అయితే ఆమె వెనుక ఉన్న సౌండ్ బాక్స్‌లను చూసుకోకపోవడంతో ప్రదర్శన మధ్యలో కింద పడిపోయింది. చుట్టుపక్కల వారి సహాయంతో వెంటనే లేచి డ్యాన్స్ చేయడం కొనసాగించింది. అయితే ఆ తర్వాత ఆ యువతి తండ్రి వేదిక మీదకు వచ్చాడు. తన కూతురు మరోసారి కింద పడకుండా ఉండేందుకు ఆమెపై ఒక కన్ను వేసి ఉంచాడు. ఆ వీడియోలో ఆమె తన తండ్రి గురించి చెప్పిన మాటలు నెటిజన్ల హృదయాలను తాకుతున్నాయి. 


`నేను మా ఫ్యామిలీ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్నాను. అయితే అనుకోకుండా వందల మంది ముందు పడిపోయాను. చుట్టుపక్కల వారు నన్ను పైకి లేపారు. నేను వెంటనే లేచి డ్యాన్స్ కొనసాగించాను. అయితే ఈ వీడియో నా గురించి కాదు.. నా వెనుక నిల్చుని నేను మరోసారి పడకుండా చూసుకోవడానికి వచ్చిన వ్యక్తి గురించి. అతను తన జీవితమంతా అలాగే చేశాడు. నా వెనుక నిల్చుని ప్రోత్సహించాడు. ఎప్పుడూ వెనకడుగు వేయవద్దని నేర్పాడు. నా రక్షకుడు.. గురువు.. నా బలం.. నేను కింద పడిన ప్రతిసారి నాకు చేయి అందించాడు.. దేవుడ అన్ని చోట్లా ఉండలేడు.. అందుకే నా దగ్గర మా నాన్న ఉన్నాడ`ని ఆమె పేర్కొంది. ఒక్క రోజులోనే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. ఏడు లక్షలకు పైగా లైక్స్ సాధించింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.    



Updated Date - 2022-07-24T22:18:45+05:30 IST