Woman fights off Leopard: అన్నం తింటుండగా ఇంట్లోకి సడన్‌గా చిరుత పులి ఎంట్రీ.. మూడేళ్ల కూతుర్ని ఈడ్చుకెళ్తోంటే..

ABN , First Publish Date - 2022-05-12T22:34:33+05:30 IST

‘అమ్మా ఆకలి’ అనే మాటలు మూడేళ్ల కూతురు నుంచి రావడంతో తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కూతురు ఆకలి తీర్చేందుకు అన్నం పెట్టి.. ఆమె ఇతర పనిలో నిమగ్నం అయిపోయింది. ఇంత

Woman fights off Leopard: అన్నం తింటుండగా ఇంట్లోకి సడన్‌గా చిరుత పులి ఎంట్రీ.. మూడేళ్ల కూతుర్ని ఈడ్చుకెళ్తోంటే..

ఇంటర్నెట్ డెస్క్: ‘అమ్మా ఆకలి’ అనే మాటలు మూడేళ్ల కూతురు నుంచి రావడంతో తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కూతురు ఆకలి తీర్చేందుకు అన్నం పెట్టి.. ఆమె ఇతర పనిలో నిమగ్నం అయిపోయింది. ఇంతలో కూతురి కేకలు విని.. పరుగెత్తుకెళ్లింది. చిరుత పులి (Leopard) తన కూతుర్ని ఈడ్చుకెళ్తుంటాన్ని చూసి షాకైంది. అనంతరం ప్రాణాలకు తెగించి మరీ Leopard పోరాటం చేసింది. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్రకు చెందిన జ్యోతి పుపాల్వర్ తన మూడేళ్ల కూతురితోపాటు చంద్రాపూర్ ప్రాంతలోని దుర్గాపూర్ కాంప్లేక్స్(Durgapur Complex)‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో కూతురు ఆకలి అనడంతో ఆ చిన్నారికి జ్యోతి అన్నం వేసి తన పనిలో నిమగ్నం అయింది. మూడేళ్ల చిన్నారి ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఇంట్లోకి చిరుత ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆ చిన్నారి భయంతో కేకలు వేసింది. కూతురి అరుపులు విన్న జ్యోతి.. చిన్నారి వద్దకు పరుగెత్తుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే తన కూతురిని Leopard ఈడ్చుకెళ్లడం చూసి షాకైంది. అనంతరం కర్ర తీసుకుని చిరుతను వెంబడించింది. ప్రాణాలకు తెగించి మరీ దానితో పోరాటం చేసింది. చివరకు కూతురు ప్రాణాలను రక్షించుకుంది. తీవ్రంగా గాయపడ్డ కూతురుని స్థానికుల సహాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కర్రతో చిరుత మూతిపై పదే పదే కొట్టింటన్నట్టు చెప్పారు. దీంతో అది తన కూతుర్ని వదిలేసిందని వెల్లడించారు. చిన్నారిని వదిలేసిన తర్వాత కూడా చిరుతను కర్రతో కొట్టడంతో తిరిగి అది తమపై దాడి చేయకుండా పారిపోయిందని వివరించారు. 



ఇక్కడ చిరుత దాడి చేయడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 15 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వాళ్లు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మూడేళ్ల చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటనపట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వైఖరిని తప్పుబట్టడంతోపాటు.. చిరుతను చంపేయాలని డిమాండ్ చేశారు. కాగా.. దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందిస్తూ.. చిరుతను హతమార్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. 


Read more