బాతుకు ఆహారం పెట్టిన 73ఏళ్ల మహిళకు స్థానిక అధికారుల షాక్!

ABN , First Publish Date - 2022-03-08T02:14:55+05:30 IST

ఆమెకు ప్రస్తుతం 73ఏళ్లు. స్థానిక అధికారుల నుంచి ఆ వృద్ధ మహిళకు తాజాగా ఓ లెటర్ వచ్చింది. అది చూసి ఆమె ఒక్కసారిగా షాకైంది. భారీ మొత్తంలో ఫైన్ కట్టాలని అధికారులు లెటర్ పంపడంతో ఆమె కంగు

బాతుకు ఆహారం పెట్టిన 73ఏళ్ల మహిళకు స్థానిక అధికారుల షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు ప్రస్తుతం 73ఏళ్లు. స్థానిక అధికారుల నుంచి ఆ వృద్ధ మహిళకు తాజాగా ఓ లెటర్ వచ్చింది. అది చూసి ఆమె ఒక్కసారిగా షాకైంది. భారీ మొత్తంలో ఫైన్ కట్టాలని అధికారులు లెటర్ పంపడంతో ఆమె కంగుతింది. బాతుకు ఆహార పదార్థాలను వేసినందుకుగాను ఆమెకు ఫైన్ విధించడం పట్ల విస్తుపోయింది. ఆ తర్వాత ఆమె ఏం చేసిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇంగ్లాండ్‌కు చెందిన సిల్వీ లుడ్లో అనే మహిళ బెక్స్లీహీత్ (Bexleyheath) ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమెకు వాకింగ్ చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే కొన్ని రోజుల క్రితం కూడా వాకింగ్ కోసమని బయటకు వెళ్లింది. వెళ్తూ వెళ్తూ కొన్ని బ్రెడ్ ముక్కలను పట్టుకెళ్లింది. వాకింగ్ చేస్తూ అక్కడ ఉన్న బాతులకు తనతోపాటు తెచ్చిన బ్రెడ్‌ ముక్కలను ఆహారంగా అందించింది. అదికాస్త అధికారుల దృష్టిలో పడింది. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. రోడ్లపై చెత్త వేసినందుకు 75పౌండ్ల(సుమారు రూ.7వేలు) జరిమాన కట్టాల్సిందిగా లెటర్ పంపించారు. ఆ లెటర్ చూసి సిల్వీ ఒక్కసారిగా షాకైంది. తన భర్త సహాయంతో సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. మూగజీవాలకు ఆహారం అందిస్తే.. తనను నేరస్థురాలుగా పరిగణిస్తారా అని ప్రశ్నించింది.  దీంతో నెటిజన్లు పెద్ద మొత్తంలో ఆమెకు మద్దతు పలికారు. తమకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయితే నెటిజన్ల నుంచి భారీ మొత్తంలో వ్యతిరేకత రావడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఫలితంగా జరిమానాను ఆమె కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.




Updated Date - 2022-03-08T02:14:55+05:30 IST