వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళకు 100 కొరడా దెబ్బల శిక్ష.. పురుషుడికి 15 దెబ్బలే.. అలా ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-01-17T09:16:18+05:30 IST

పరాయి పరుషుడితో ఒక వివాహిత చెట్లచాటున రాసలీలలు సాగిస్తుండగా పట్టుబడింది. భర్తను కాదని వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరంగా పరగణించిన స్థానిక కోర్టు ఆమెకు 100 కొరడా దెబ్బలు కొట్టాలని శిక్ష విధించింది. కానీ ఆమెతో ఉన్న పురుషుడికి మాత్రం 15 దెబ్బల శిక్ష మాత్రమే...

వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళకు 100 కొరడా దెబ్బల శిక్ష.. పురుషుడికి 15 దెబ్బలే.. అలా ఎందుకంటే..

పరాయి పరుషుడితో ఒక వివాహిత చెట్లచాటున రాసలీలలు సాగిస్తుండగా పట్టుబడింది. భర్తను కాదని వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరంగా పరగణించిన స్థానిక కోర్టు ఆమెకు 100 కొరడా దెబ్బలు కొట్టాలని శిక్ష విధించింది. కానీ ఆమెతో ఉన్న పురుషుడికి మాత్రం 15 దెబ్బల శిక్ష మాత్రమే విధించారు. ఈ ఘటన ఇండోనేషియాలోని అకేహ్ ప్రావిన్స్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. 2018 ఇండోనేషియాలోని అకేహ్ ప్రావిన్స్‌లో ఒక వివాహిత మరో పురుషుడితో పామ్ చెట్ల తోటలో ఏకాంతంగా ఉన్న సమయంలో స్థానికులు వారిద్దరినీ పట్టుకున్నారు. అకేహ్ ప్రావిన్స్‌లో ముస్లింల షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారు. షరియా చట్ట ప్రకారం విచారణ చేసిన స్థానిక కోర్టు ముందు ఆ మహిళ తన నేరాన్ని అంగీకరించింది. తాను తప్పు చేసినట్లు అందరి ముందూ ఒప్పుకుంది. దీంతో ఆమెకు కోర్టు 100 కొరడా దెబ్బలు కొట్టాలని షరియా చట్ట ప్రకారం శిక్ష విధించింది.


కానీ ఆమెతో పాటు పట్టుబడిన పురుషుడు తన నేరాన్ని అంగీకరించలేదు. అయినా కోర్టు అతనికి 30 కొరడా దెబ్బలు శిక్ష విధించింది. అతనికి ఇంకా పెళ్లి కాకపోవడంతో మహిళతో పోలిస్తే పురుషుడికి శిక్ష తక్కువ. ఆ తరువాత ఆ పురుషుడు స్థానికి కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళ్లాడు. అక్కడ ఇతని శిక్ష 15 దెబ్బలకు తగ్గించారు.


షరియా చట్ట ప్రకారం అకెహ్ ప్రావిన్సులో శిక్షలను బహిరంగంగా అమలు పరుస్తారు. జూదం, వ్యభిచారం, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం వంటి చర్యలపై అక్కడ కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు. వివాహేతర సంబంధం నేరం కింద 100 దెబ్బలు కొట్టేటప్పుడు ఆ మహిళకి నొప్పిగా ఉండడం చూసి.. శిక్షను కాసేపు మధ్యలో ఆపినట్లు స్థానికి మీడియా తెలిపింది.

Updated Date - 2022-01-17T09:16:18+05:30 IST