మే నెలలో పెళ్లి.. డిసెంబర్‌లో ప్రసవం.. పెళ్లయిన 6 నెలలకే తల్లి ఎలా అయిందంటూ అత్తారింట్లో రచ్చరచ్చ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-12-21T20:15:07+05:30 IST

వారిద్దరికీ గతేడాది మే నెలలో పెళ్లి జరిగింది.. డిసెంబర్ నాటికి ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది..

మే నెలలో పెళ్లి.. డిసెంబర్‌లో ప్రసవం.. పెళ్లయిన 6 నెలలకే తల్లి ఎలా అయిందంటూ అత్తారింట్లో రచ్చరచ్చ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

వారిద్దరికీ గతేడాది మే నెలలో పెళ్లి జరిగింది.. డిసెంబర్ నాటికి ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.. పెళ్లయిన 6 నెలలకే తల్లి ఎలా అయిందంటూ అత్తింటి సభ్యులు, చుట్టు పక్కల వాళ్లు అనుమానించడం మొదలు పెట్టారు.. ఆమెను, పుట్టిన బిడ్డను ఇంటి నుంచి బయటకు తరిమేశారు.. దీంతో ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.. అక్కడ షాకింగ్ విషయం చెప్పింది.. దీంతో రంగంలోకి దిగిన ఫ్యామిలీ కోర్టు భర్తకు, అతని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి కథను సుఖాంతం చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. 


2020 మే 30న గుణకు చెందిన యువకుడితో బాధిత మహిళకు వివాహం జరిగింది. పెళ్లయిన 6 నెలల తర్వాత డిసెంబర్ 10న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 6 నెలలకే సంతానం కలగడంతో అత్తమామల ఇంట్లో కలకలం రేగింది. అత్తమామలు, ఇరుగుపొరుగువారు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆ మహిళ తన భర్తకు అన్ని విషయాలు తెలుసు అని చెబుతూ వచ్చింది. కొన్ని రోజులకు ఆ మహిళను, పిల్లవాడిని అత్తమామలు బయటకు పంపించారు. భర్త ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు. దీంతో ఆ మహిళ గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 


ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన భర్త తనను అందరి ఎదుటా మే నెలలో వివాహం చేసుకున్నాడని, అయితే అంతకంటే ముందే తనను ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ ఫ్యామిలీ కోర్టుకు తెలిపింది. ఆ సమయంలో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చానని చెప్పింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే తన భర్త తనను అందరి ముందు వివాహం చేసుకున్నాడని చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ ఆ యువతి భర్తతో మాట్లాడారు. ముందు ఆ బిడ్డ తనకు పుట్టలేదని అతను బుకాయించాడు. 


డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తామని, ఆ బిడ్డ నీకు పుట్టిందే అని తేలితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కౌన్సిలర్ బెదిరించారు. దీంతో బాధిత మహిళ భర్త అసలు నిజం ఒప్పుకున్నాడు. తన కుటుంబ సభ్యులకు, బంధువులకు అసలు విషయం చెప్పాడు. దీంతో అత్తింటి వారు తమ కోడలికి క్షమాపణలు చెప్పారు. ఆ మహిళను, పుట్టిన బిడ్డను ఇంట్లోకి ఆహ్వానించారు. 


Updated Date - 2021-12-21T20:15:07+05:30 IST