ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ మెడలో ఉన్న స్కార్ఫ్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

Sep 18 2021 @ 14:19PM

పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ మెడలో ఉన్న స్కార్ఫ్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆమె తను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కల బొచ్చుతో ఈ స్కార్ఫ్‌ను తయారు చేయించుకుంది. ఆ మహిళ పేరు మిచెల్. ఆమెకు కుక్కలంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఆమె మూడు కుక్కలను పెంచుకుంటోంది. ఆ కుక్కలు తన జీవితాంతం తనతో ఉండలేవు కాబట్టి.. వాటి జ్ఞాపకాలను తనతో భద్రపరచుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు ఈ ఐడియా వచ్చింది.  


తన నాలుగేళ్ల కుక్క లూకా, 12 ఏళ్ల కుక్క కీషోండ్ బొచ్చు నుంచి 623 గ్రాముల ఉన్ని సేకరించి దానితో 5 అడుగుల కండువాను తయారు చేయించింది. ఓ స్పిన్నింగ్ మిల్లుకు ఆ ఉన్నిని తీసుకెళ్లి అక్కడి నిపుణుడి చేత ప్రత్యేకంగా ఆ స్కార్ఫ్‌ను తయారు చేయించింది. ఆ స్కార్ఫ్ తయారు కావడానికి మొత్తం రూ.18 వేలు ఖర్చయ్యాయి. దానిని ఆమె ప్రత్యేక పద్ధతుల్లో ఉతుకుతూ జాగ్రత్తగా చూసుకుంటోంది. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.