భార్యకు 3వ సారి కవలలు.. ‘ఇదే చాలా ఎక్కువ.. ఇంటి నుంచి వెళ్లిపో’ అన్నాడు.. ఆమె 5వ సారి కూడా కవలలకు జన్మనివ్వడంతో...

ABN , First Publish Date - 2022-07-21T14:57:47+05:30 IST

ఒక వ్యక్తి తన భార్యను విచిత్ర కారణంతో...

భార్యకు 3వ సారి కవలలు.. ‘ఇదే చాలా ఎక్కువ.. ఇంటి నుంచి వెళ్లిపో’ అన్నాడు.. ఆమె 5వ సారి కూడా కవలలకు జన్మనివ్వడంతో...

ఒక వ్యక్తి తన భార్యను విచిత్ర కారణంతో విడిచిపెట్టాడు. ఐదవసారి కూడా ఆమె కవలలకు జన్మనివ్వడంతో భర్త బెంబేలెత్తిపోయాడు. వరుసగా ఐదుసార్లు కవలలు పుట్టడాన్ని భర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ మహిళ ఇప్పటికే 10 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ఆఫ్రికాలోని ఉగాండాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. 5వ సారి కవలలకు జన్మనిచ్చిన నాలోంగో గ్లోరియా అనే మహిళను ఆమె భర్త స్లాంగో  విడిచిపెట్టాడు. ఆ మహిళ ఇటీవలే తొమ్మిది, పదవ పిల్లలకు జన్మనిచ్చింది.


భర్త ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లిపోయాడో ఆ మహిళకు ఇంతవరకూ తెలియదు.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను మూడవసారి గర్భవతిని అయి కవలలకు జన్మనిచ్చినప్పుడు.. ఇదే చాలా ఎక్కువ.. ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నాడని ఆమె తెలిపింది. ఇప్పుడు తన భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో తనకేమీ తెలియదని గ్లోరియా తెలిపింది. ఈ పరిస్థితిపై గ్లోరియా బాధపడుతోంది. ఇకపై అంతా దేముడిదే భారమని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని గ్లోరియా స్పష్టం చేసింది. తన పెద్ద పిల్లలు కూడా తనను విడిచిపెట్టి వెళ్లిపోయారని, వారు ఎక్కడున్నారో తనకు తెలియదన్నారు. ఇటువంటి పరిస్థితిలో గ్లోరియా తన పిల్లలతో పాటు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని కోరింది. గ్లోరియా ఇప్పుడు తన పిల్లలతో పాటు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంది. 

Updated Date - 2022-07-21T14:57:47+05:30 IST