ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన 22 ఏళ్ల యువతి.. విచిత్రం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-24T22:15:19+05:30 IST

ఒకే కాన్పులో కవల పిల్లలు జన్మించడం గురించి మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం.

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన 22 ఏళ్ల యువతి.. విచిత్రం ఏంటంటే..

ఒకే కాన్పులో కవల పిల్లలు జన్మించడం గురించి మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అలాగే, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టడం మాత్రం కాస్త అరుదైన విషయమే. ఇక, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడమనేది మాత్రం చాలా అరుదు. 5.12 లక్షల మంది మహిళల్లో ఒకరు మాత్రమే నలుగురు పిల్లలకు జన్మనిస్తారట. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఏడు లక్షల ప్రెగ్నెన్సీల్లో ఒక్కసారి మాత్రమే నలుగురు పిల్లలు పుడతారని వైద్యులు పేర్కొన్నారు. 


తాజాగా కర్ణాటకలోని భద్రావతి తాలూకాకు చెందిన అల్మాజ్ భాను అనే మహిళ సర్జీ హాస్పిటల్‌లో సోమవారం ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కాన్పులో ఆమె ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. మొత్తం ఐదుగురూ క్షేమంగా ఉన్నారని గైనకాలజిస్ట్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-24T22:15:19+05:30 IST