లేటు వయసులో యువకుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు దొరికిపోయింది.. పరువు కాపాడుకునేందుకు ఆమె ఎంత డ్రామా ఆడిందంటే..

Published: Sat, 05 Mar 2022 13:12:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లేటు వయసులో యువకుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు దొరికిపోయింది.. పరువు కాపాడుకునేందుకు ఆమె ఎంత డ్రామా ఆడిందంటే..

ఆమె వయసు 48 సంవత్సరాలు.. యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు.. అయినా ఆమె తమ పక్కింట్లో ఉండే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. గత నెల 16వ తేదీన ఇంట్లో అతడితో శృంగారం సాగిస్తూ భర్తకు దొరికిపోయింది.. భర్త ఎవరికైనా చెబుతాడేమోననే భయంతో అతడిని చంపేసింది.. అనంతరం పోలీసుల వద్ద డ్రామా మొదలుపెట్టింది.. రెండు వారాల తర్వాత పోలీసులు అసలు విషయం కనిపెట్టారు.. 


మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌కు సమీపంలోని బేతుల్‌కు చెందిన ఓం ప్రకాశ్ చనిపోయినట్టు పోలీసులకు గత నెల 16వ తేదీన సమాచారం అందింది. అతని భార్య అనసూయ ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పొలంలో పడుక్కున్న తన భర్తను ఎవరో చంపేశారని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బంధుమిత్రులను పిలిచి విచారించారు. ఆ క్రమంలో అనసూయ వివాహేతర సంబంధం విషయం బయటపడింది. దీంతో ఆమె ప్రియుడు రామ్ విలాస్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను అసలు విషయం బయటపెట్టాడు. 


గత నెల 16వ తేదీ రాత్రి తామిద్దరం శృంగారం సాగిస్తుండగా ఓం ప్రకాశ్ చూసేశాడని, అతను గొడవ చేస్తాడేమోననే భయంతో అక్కడే అతడిని చంపేసి పొలంలోకి తీసుకెళ్లి పడేశామని చెప్పాడు. అనసూయతో తనకు గత ఐదేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్టు రామ్ విలాస్ చెప్పాడు. దీంతో పోలీసులు అనసూయను, రామ్ విలాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.