
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. పాత నాణాలను సేకరించే వారు కొందరైతే.. అరుదైన వస్తులను భద్రపరిచే వారు మరికొందరు ఉంటారు. ఈ క్రమంలో ఓ మహిళ చేస్తున్న ఓ పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమెకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇంతకూ ఆమె ఏం చేస్తుందనే వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఎవరికైనా రెండు మూడు జతల చెప్పులు ఉంటాయి. కొందరికి పదుల సంఖ్యలో కూడా ఉంటాయి. కానీ కెనడాకు చెందిన ఓ మహిళ మాత్రం రబ్బరు చెప్పులపై ఉన్న మక్కువతో అనూహ్య నిర్ణయం తీసుకుంది. వందలాది చెప్పులను కొనుగోలు చేసి, బెడ్రూమ్ మొత్తం నింపేసింది. చెప్పుల షోరూమ్‌గా మార్చేసింది. అంతేకాకాకుండా వాటిని అందంగా అలంకరించడానికి ఉపకరణాలను కూడా కొనుగోలు చేసింది. ఎక్కడికి వెళ్లినా సరే సరికొత్త చెప్పులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తానని సదరు మహిళ చెబుతోంది. కాగా.. చెప్పులతో కూడిన బెడ్రూమ్ వీడియోను ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇదేం అలవాటు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి