బేకరీలో మహిళ హల్ చల్

Published: Sat, 04 Dec 2021 17:04:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బేకరీలో మహిళ హల్ చల్

హైదరాబాద్: నగరంలోని ఓ బేకరీలో మహిళ హల్‌చల్ చేసింది. ఎస్సాఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతీనగర్‌లో ఉన్న మిడ్ ల్యాండ్ బేకరీకి ఓ మహిళా కస్టమర్ వచ్చింది. అనంతరం బేకరీకి వచ్చిన వారిపై ఆ యువతి దురుసుగా ప్రవర్తించింది. తినుబండారాలను పక్కన ఉన్న కస్టమర్స్ పైకి విసిరింది. దాంతోపాటుగా అక్కడ గొడవ చేసింది. 100 డయల్‌కి కస్టమర్స్ కాల్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా ఆ యువతి దురుసుగా ప్రవర్తించింది. స్థానిక మహిళల సహాయంతో యువతిని ఎస్సాఆర్ నగర్ పీఎస్‌కి పోలీసులు తరలించారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.