
ఆమె వివాహిత.. భర్త ఉండగానే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఆ విషయం తెలుసుకున్న భర్త అదృశ్యమయ్యాడు.. దాంతో అతనితో ఆరేళ్లుగా సహజీవనం చేస్తోంది.. ఇటీవల ఆమె హత్యకు గురైంది.. సహజీవనం చేసిన వ్యక్తి చేతిలోనే హతమైంది.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు షాకింగ్ విషయం బయటపెట్టారు.
హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తి 2012లో కమల అనే మహిళను వివాహం చేసుకున్నాడు. భర్త ఉండగానే సురేందర్ అనే వ్యక్తితో కమల 2014లో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య సంబంధం మహేష్‌కు తెలిసింది. ఒకరోజు హఠాత్తుగా మహేష్ అదృశ్యమయ్యాడు. దీంతో కమల తన భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. దీంతో సురేందర్‌తో కమల ఒకే ఫ్లాట్‌లో కలిసి నివసించడం ప్రారంభించింది.
ఉద్యోగం లేకుండా కమల జీతం మీదే ఆధారపడుతూ సురేందర్ జీవితం సాగిస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన మద్యం సేవించి ఇంటికి వెళ్లిన సురేందర్.. కమలతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను చంపేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సురేందర్ కోసం గాలింపు చేపట్టారు. మూడ్రోజుల అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించాడు. విచారణలో అతను అసలు విషయం బయటపెట్టాడు. కమల భర్త మహేష్ మిస్సింగ్ కాదని, కమలతో కలిసి తానే అతడిని చంపి పూడ్చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి