ఈ ఫొటోలో కనిపిస్తున్నది పురుషుడు కాదు.. మహిళ.. 43 ఏళ్లుగా గొంతు మార్చి మరీ మగాడిలా జీవనం.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-01-02T23:46:01+05:30 IST

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ 43ఏళ్లుగా పురుషుడి రూపంలో కనిపిస్తోంది. ఏ ఆపరేషన్ చేయించుకోకుండా దుస్తులు మార్చడంతో పాటూ తన గొంతును కూడా అచ్చం మగాడిలా మార్చుకుంది. అందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం..

ఈ ఫొటోలో కనిపిస్తున్నది పురుషుడు కాదు.. మహిళ.. 43 ఏళ్లుగా గొంతు మార్చి మరీ మగాడిలా జీవనం.. కారణమేంటంటే..

కొందరు ఆడవారు మగవారిలా, మగవారు ఆడవారిలా మారేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం చూస్తుంటాం. ఇంకొందరైతే పుట్టుకతోనే రూపం ఒకలా లక్షణాలు ఒకలా ఉండడం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ 43ఏళ్లుగా పురుషుడి రూపంలో కనిపిస్తోంది. ఏ ఆపరేషన్ చేయించుకోకుండా దుస్తులు మార్చడంతో పాటూ తన గొంతును కూడా అచ్చం మగాడిలా మార్చుకుంది. అందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం..


ఈజిప్టుకు చెందిన సిసా అబు దౌహ్ అనే మహిళకు 16 సంవత్సరాల వయస్సులో వివాహమైంది. 21ఏళ్ల వయసులో ఆమెకు కుమార్తె పుట్టింది. ఈమె ఆరు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త మరణించాడు. కుటుంబ పెద్ద మరణంతో ఆమె ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కుమార్తె ఆలనాపాలనాతో పాటూ ఇల్లు గడవడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలో చాలా ఉద్యోగాలు చేసేందుకు ప్రయత్నించినా విఫలమవుతూ వచ్చింది. దీనికితోడు లింగ వివక్ష కారణంగా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అప్పుడే ఆమె పురుషుడి రూపంలో ఉంటూ అనుకున్నది సాధించాలని నిర్ణయించుకుంది.

న్యూఇయర్ వేడుకల్లో పోలీసులు.. మందులోకి ముక్క లేదని వారు చేసిన పనికి గ్రామస్తులు షాక్.. చివరకు


అనంతరం మగవారి దుస్తులు ధరించడంతో పాటూ ఎక్కడా తాను మహిళ అనే అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. స్వరం విషయంలో కూడా కసరత్తులు చేసి, చివరకు మగవారిలాగే మాట్లాడటం నేర్చుకుంది. తర్వాత ఉపాధి కోసం మగవారితో సమానంగా పనులు చేయడం మొదలెట్టింది. ఇటుకల తయారీ, బూటు పాలిష్ తదితర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది. లింగవివక్షపై ఆమె పోరాటం చేయడంతో ఈజిప్టులో అందరికీ తెలియడంతో పాటూ 2015 మార్చిలో ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ అల్-సిసిని చేతుల మీదుగా ఉత్తమ మమ్ పురస్కారం అందుకుంది. అప్పటి నుంచి ఆమెను ఈజిప్టు ప్రజలు ఉమ్మ్ హోడా, హోడాస్ మమ్ అని పిలుస్తుంటారు.

ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు ఆరోగ్యంగా ఉన్నా.. పరీక్షించిన వైద్యులు ఏమంటున్నారంటే..

Updated Date - 2022-01-02T23:46:01+05:30 IST