జీన్స్ వేసుకున్న గుర్రం.. నెట్టింట వైరల్

Jul 22 2021 @ 16:25PM

న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో నెట్టింట అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొన్ని సన్నివేశాలను పంచుకుంటున్నారు. దానిపై నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తుంటారు. అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అమెరికాలో ఉంటున్న ఓ మహిళ తమ ఇంట్లో పెంచుకుంటున్న గుర్రానికి జీన్స్ ప్యాంట్ వేసింది. దాని కాలికి తగిలిన గాయం కనపడకుండా గుర్రానికి జీన్స్ వేసింది. ఈ నెల 18వ తేదీన ఆమె భర్త గుర్రం ఫోటోని పోస్ట్ చేసి, ‘నా భార్య గుర్రాన్ని అందంగా తయారుచేసింది. దానికి తగిలిన గాయం కనపడకుండా ఇలా చేసింది’ అని హ్యాష్ ట్యాగ్ జతచేశాడు. పోస్ట్ చేసినప్పటినుంచి ఈ ఫోటోను దాదాపు 66,000 మంది లైక్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. గుర్రాలు కూడా జీన్స్ ధరించడం ఆశ్యర్యంగా ఉంది. కానీ గుర్రం చాలా ప్యాషన్‌గా కనిపిస్తుందని ట్వీట్ చేశాడు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...