Killed With Kiss: ముద్దు పెట్టి చంపేసిన ప్రేయసి.. కనీవినీ ఎరుగని వింత కేసు..!

ABN , First Publish Date - 2022-08-19T20:27:56+05:30 IST

ఆ మహిళ ఓ ఖైదీని చూసేందుకు జైలుకు వెళ్లింది. అతడితో కొంత సేపు మాట్లాడింది.

Killed With Kiss: ముద్దు పెట్టి చంపేసిన ప్రేయసి.. కనీవినీ ఎరుగని వింత కేసు..!

ఆ మహిళ ఓ ఖైదీని చూసేందుకు జైలుకు వెళ్లింది. అతడితో కొంత సేపు మాట్లాడింది. ఆ తర్వాత అతడిని గాఢంగా పెదవులపై చుంబించింది. కొద్ది సేపటి తర్వాత ఆ ఖైదీ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు (Woman killed prisoner)కోల్పోయాడు. అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాచెల్ డోలార్డ్ అనే మహిళ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జాషు బ్రౌన్‌ను కలవడానికి టేనస్సీ జైలుకు వెళ్లింది.


ఇది కూడా చదవండి..

Madhya Pradesh: ప్రియుడు తెచ్చిన విషాన్ని నీళ్లల్లో కలిపి భర్తకు ఇచ్చా.. అందుకే చనిపోయాడని ఆ భార్య చెప్పినా పోలీసులు మాత్రం..


జాషుతో రాచెల్ కొద్ది సేపు మాట్లాడింది. ఆ తర్వాత అతడికి లిప్ కిస్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె తన నోటి నుంచి 14 గ్రాముల మెథాంఫెటమైన్ (Methamphetamine) అనే హానికర డ్రగ్‌ను తన నోటి నుంచి జాషు నోటిలోకి బదిలీ చేసింది. ఆ డ్రగ్‌ను జాషు ఒక్కసారి మింగేశాడు. కొంత సమయం తర్వాత తీవ్ర దుష్ర్పభావాలకు లోనై మరణించాడు. పోలీసులు వెంటనే రాచెల్‌ను హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. రాచెల్ ఎందుకు అలా చేసిందని విచారిస్తున్నారు. 

Updated Date - 2022-08-19T20:27:56+05:30 IST