Haryana: మరో నిర్భయ.. రన్నింగ్ ట్రైన్‌లో కొడుకు ఎదుటే తల్లిపై అత్యాచార యత్నం.. ఆమె ప్రతిఘటించడంతో దారుణం..

ABN , First Publish Date - 2022-09-03T03:03:33+05:30 IST

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

Haryana: మరో నిర్భయ.. రన్నింగ్ ట్రైన్‌లో కొడుకు ఎదుటే తల్లిపై అత్యాచార యత్నం.. ఆమె ప్రతిఘటించడంతో దారుణం..

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు రూపొందిస్తున్నా మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మృగాళ్ల కామ వాంఛలకు స్త్రీలు బలి అవుతూనే ఉన్నారు. తాజాగా హర్యానాలోని (Haryana) ఫతేబాద్‌లో దారుణ ఘటన జరిగింది. కన్న కొడుకు ఎదుటే ఓ మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ట్రైన్ నుంచి బైటకు (Woman Being Thrown Off Train) తోసేశాడు. అనంతరం ఆ వ్యక్తి కూడా బయటకు దూకేశాడు. స్టేషన్‌లో వేచి ఉన్న తండ్రికి కొడుకు అసలు విషయం చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. 


ఇది కూడా చదవండి..

Shocking: భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భర్త.. కారణమేంటో తెలిస్తే షాక్!


బాధిత మహిళ (30) తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఫతేబాద్‌ జిల్లాలోని రోహతక్‌ నుంచి తోహానాకు రైలులో వెళ్తోంది. బాధితురాలు ఒంటరిగా ప్రయాణిస్తున్న విషయాన్ని ఓ వ్యక్తి గుర్తించాడు. కొడుకు ఎదురుగానే ఆమెపై  లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతడిని బాధితురాలు ప్రతిఘటించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన నిందుతుడు ఆమెను నడుస్తున్న రైలు నుంచి బయటకు తోసేశాడు. అనంతరం అతను కూడా రైలు నుంచి బయటకు దూకేశాడు. భార్యను, కొడుకును రిసీవ్ చేసుకునేందుకు బాధితురాలి భర్త తోహానా స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నాడు. ట్రైన్ స్టేషన్‌కు చేరుకోగానే ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న కొడుకును చూసి బాధితురాలి భర్త ఆందోళనకు గురయ్యాడు. 


తల్లి ఎక్కడ అని అడగడంతో ఆ బాలుడు మొత్తం విషయాన్ని తండ్రికి తెలిపాడు. దీంతో బాధితురాలి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సివిల్‌ పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు రైల్వే ట్రాక్‌ వెంట వెతికారు. ట్రాక్‌ పక్కన పొదల్లో బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. కాగా, నిందితుడిని సందీప్ (27)గా గుర్తించి అరెస్ట్‌ చేసినట్టు ఫతేబాద్ పోలీసు చీఫ్ తెలిపారు. కాగా, బాధితురాలు ప్రయాణిస్తున్న రైలు కోచ్‌లో ముగ్గురు మాత్రమే ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-03T03:03:33+05:30 IST