ప్రమాదంలో మృతి చెందిన కోటేశ్వరి
పెద్ద దోర్నాల, జూన్ 25: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని చట్టుతాండ వద్ద శనివారం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూటర్‌పై నుంచి జారి పడడంతో గురజాలకు చెందిన తాటికొండ కోటేశ్వరి(37) మృతి చెందింది. పోలీసులు తెలిపిన కధనం ప్రకారం.. కోటేశ్వరి తన భర్త వెంకటాచారి స్కూటర్‌పై శ్రీశైలం వెళుతున్నారు. చట్టుతాండ వద్ద స్పీడు బ్రేకర్ దాటుతూ కుదుపుకు కోటేశ్వరి జారి కింద పడింది. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్సలు నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించగా వైద్యశాలలో ఆమె మృతి చెందినట్లు ఎస్సై ఉయ్యాల హరిబాబు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు వివరించారు.