Dubai లో అమానుష ఘటన.. పుట్టిన బిడ్డను 15 నిమిషాలకే చంపేసిన తల్లి.. 3రోజుల పాటు Bag లో పెట్టి.. చివరికి

Published: Tue, 24 May 2022 13:14:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Dubai లో అమానుష ఘటన.. పుట్టిన బిడ్డను 15 నిమిషాలకే చంపేసిన తల్లి.. 3రోజుల పాటు Bag లో పెట్టి.. చివరికి

దుబాయ్: దుబాయ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. బిడ్డ పుట్టిన 15 నిమిషాలకే ఊపిరాడకుండా చేసి చంపేసిందో తల్లి. అనంతరం శిశువు మృతదేహాన్ని 3 రోజుల పాటు బ్యాగులో పెట్టి ఇంట్లోనే ఉంచింది. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పడేయాలని చూసింది. ఈ క్రమంలో ఓ ట్యాక్సీ ఎక్కిన ఆమె.. డ్రైవర్‌తో మాట్లాడిన తీరు అతనికి అనుమానం కలిగించింది. దాంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. అనంతరం మహిళను దుబాయ్‌లో కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన సదరు మహిళకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది.  


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లో నివాసం ఉండే ఓ మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో ఆమె గర్భం దాల్చింది. తొమ్మిది నెలల తర్వాత తన ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శిశువు పుట్టగానే గట్టిగా ఏడ్వడంతో మహిళకు ఏం చేయాలో తోచలేదు. చుట్టుపక్కల వారికి తెలిస్తే పరిస్థితి ఏంటని కంగారు పడిన ఆమె.. పసికందును మంచంపై పడేసి దిండుతో ముఖంపై అదిమిపట్టింది. దాంతో శిశువు ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన బిడ్డను ఓ బ్యాగులో పెట్టి, మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. సమయం చూసి బయటకు తీసుకెళ్లి పడేయాలనేది ఆమె ఆలోచన. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరు లేని సమయం చూసి ఓ ట్యాక్సీ బుక్ చేసింది. శిశువు మృతదేహం ఉన్న బ్యాగుతో ఆ ట్యాక్సీ ఎక్కింది. 


ఆ సమయంలో ఆమె ట్యాక్సీ డ్రైవర్‌తో మాట్లాడిన తీరు అతనికి అనుమానం కలిగించింది. అంతేగాక సదరు మహిళ ఒంటరిగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లడం డ్రైవర్ గమనించాడు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనకు పుట్టిన బిడ్డను తానే చంపేసి, ఖననం చేసినట్లు అంగీకరించింది. దాంతో ఆమెను తాజాగా దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో కూడా తన నేరాన్ని అంగీకరించింది. దీంతో కోర్టు ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే శిక్షకాలం పూర్తియైన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.