Suspicious incident: ఊరికి దూరంగా భర్త.. ట్యూషన్ టీచర్‌తో రాత్రంతా భార్య సంభాషణ.. పొద్దున లేచి చూస్తే..

ABN , First Publish Date - 2022-08-01T00:13:40+05:30 IST

భర్తకు దూరంగా ఉండే మహిళలు.. నిత్యం పలు రకాల వేధింపులు, ఆరోపణలను ఎదుర్కొంటుంటారు. కొందరు వివాహేతర సంబంధాల (Extramarital affairs) కారణంగా..

Suspicious incident: ఊరికి దూరంగా భర్త.. ట్యూషన్ టీచర్‌తో రాత్రంతా భార్య సంభాషణ.. పొద్దున లేచి చూస్తే..

భర్తకు దూరంగా ఉండే మహిళలు.. నిత్యం పలు రకాల వేధింపులు, ఆరోపణలను ఎదుర్కొంటుంటారు. కొందరు వివాహేతర సంబంధాల (Extramarital affairs) కారణంగా చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటే.. ఇంకొందరు అనుమానాస్పద స్థితిలో హత్యలు, ఆత్మహత్యలకు గురవుతుంటారు. బీహార్‌లో  ఇలాంటి ఘటనే జరిగింది. ఉపాధి నిమిత్తం భర్త తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్‌తో భార్యకు పరిచయం ఏర్పడింది. రోజూ రాత్రిళ్లు మాట్లాడుకునేవారు. అయితే ఓ రోజు పొద్దున సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


పోలీసుల కథనం మేరకు.. బీహార్ (Bihar) రాష్ట్రం ముజఫర్‌పూర్‌కు చెందిన రంజన్ సింగ్‌కు భార్య కాజల్ దేవి (30), ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో రంజన్ సింగ్.. ఉపాధి నిమిత్తం కాన్పూర్‌లో ఉంటున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల కాజల్ దేవి తన పిల్లలను ట్యూషన్‌కు పంపిస్తోంది. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఆమె మామతో పాటూ గ్రామస్తులకు కూడా.. వీరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానం ఉండేది. శనివారం రాత్రి కాజల్ దేవి, ట్యూషన్ టీచర్‌తో ఫోన్‌లో చాలా సేపు మాట్లాడింది.

Girl selfie video: నా వయసు 17ఏళ్లు.. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మకు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా.. అంటూ ఓ బాలిక చెప్పింది విని..


అయితే ఏమైందో ఏమో తెలీదుగానీ ఆదివారం ఉదయం కాజల్ దేవి తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని (dead body) పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి చేతిపై కత్తితో కట్ చేసినట్లు గుర్తులు ఉన్నాయి. టీచర్‌ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కాల్ డేటా వివరాలను పరిశీలిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే కాజల్ దేవి మృతి చెందిందా.. లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు (Investigate) చేస్తున్నారు.

rare marriage: పుట్టుమచ్చను చూసి భర్తను గుర్తించడంతో.. 30 ఏళ్ల తర్వాత వివాహం.. కలా లేక నిజమా! అంటున్న గ్రామస్తులు..



Updated Date - 2022-08-01T00:13:40+05:30 IST