స్నేహితుల కోసం.. టాయిలెట్ సీట్‌లో పార్టీ డ్రింక్ తయారీ.. వీడియో వైరల్!

Apr 28 2021 @ 14:03PM

మెరికన్ మహిళకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలో సదరు మహిళ చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకు ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా ఆమెను విమర్శించకుండా ఉండలేరు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. అమెరికాలోని ఓ మహిళ తన ఇంటికి వచ్చిన స్నేహితులకు వికారమైన పార్టీ డ్రింక్ తయారు చేసి ఇవ్వడం ఈ వీడియోలో ఉంది. సదరు మహిళ డ్రింక్ తయారు చేసేందుకు ఎంచుకున్న చోటు ఎంటో తెలుసా? టాయిలెట్ సీట్. అవును మీరు విన్నది నిజమే. మొదట టాయిలెట్ సీట్‌ను ఐస్ క్యూబ్స్, ఐస్‌క్రీం, చాక్లెట్ తదితర పదార్థాలతో నింపేసిందామె. ఆ తర్వాత ఫ్లషర్‌లో కూల్ డ్రింక్స్(స్ప్రైట్, ఫాంటా) పోసింది. అనంతరం ఫ్లషర్‌ను ఆన్ చేయడంతో కూల్ డ్రింక్స్ టాయిలెట్ సీట్‌లోకి చేరాయి. ఆ మిశ్రమాన్ని శుభ్రంగా కలిపి గ్లాసుల్లో పోసిన ఆ మహిళ.. బయట ఉన్న తన స్నేహితులకు అందించింది. కానీ, వారికి ఆ డ్రింక్ టాయిలెట్ నుంచి వచ్చినట్లు తెలియడంతో తాగలేదు. ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు రావడంతో వైరల్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 6.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు 'ఇంతకంటే అధ్వానమైన విషయం' మరొకటి ఉండదని విమర్శిస్తున్నారు.       

Follow Us on:

అమెరికా నగరాల్లోమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.