అయితే కొన్నాళ్లుకు ఆమెకు అసలు విషయం తెలిసింది. అతడికి తనపై ఉన్నది తల్లిపై ఉండే ప్రేమ కాదని అర్థం చేసుకుంది. దీంతో అతడితో ఈ విషయంపై మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమె అంటే తనకిష్టమని వ్లాదిమిర్ చెప్పడంతో ఆమె కొంత ఆలోచనలో పడింది. కానీ చివరకు ఓకే చెప్పింది. దీంతో వ్లాదిమిర్ ఆనందానికి హద్దుల్లేవు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక తండ్రి కూడా ఒకే చెప్పాడు.
ఈ జంట అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు వీరికి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే కొడుకుతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డతో ఉన్న ఫోటోను మరియా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీరిద్దరి బంధంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు ఆమె చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ వివాహాన్ని, వారి బంధాన్ని సమర్థస్తున్నారు. సవతి కొడుకు కావడం, భర్తతో విడాకులు తీసుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఈ వివాహంలో ఎలాంటి తప్పూ లేదని వారు కామెంట్స్ చేస్తున్నారు.