ఆ షరతును పూర్తిచేయడానికి పిల్లిని పెళ్లిచేసుకున్న మహిళ!

ABN , First Publish Date - 2022-05-01T08:12:55+05:30 IST

పెంపుడు పిల్లిని విడిచి ఉండలేని ఓ మహిళ ఏకంగా ఆ పిల్లిని పెళ్లి చేసుకుంది. అవును ఇది నిజం. తన నుంచి తనకు ఎంతో ఇష్టమైన పిల్లిని దూరం చేసుకోలేక ఆమె వివాహం చేసుకుంది

ఆ షరతును పూర్తిచేయడానికి పిల్లిని పెళ్లిచేసుకున్న మహిళ!

పెంపుడు పిల్లిని విడిచి ఉండలేని ఓ మహిళ ఏకంగా ఆ పిల్లిని పెళ్లి చేసుకుంది. అవును ఇది నిజం. తన నుంచి తనకు ఎంతో ఇష్టమైన పిల్లిని దూరం చేసుకోలేక ఆమె వివాహం చేసుకుంది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం.


వివరాల్లోకి వెళితే.. లండన్ నగరానికి చెందిన 46 ఏళ్ల డెబోరా హోడ్జ్ అనే మహిళకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అయితే సొంత ఇల్లు లేని డెబోరాకు అద్దె ఇంట్లో జంతువులను పెంచుకోవడం కష్టంగా మారింది. అద్దె ఇంటి యజమానులు ‘పెంపుడు జంతువులను అనుమతించం’ అంటూ డెబోరాకు షరతులు విధించేవారు. దీంతో మూడుసార్లు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్కలు, పిల్లులను వదిలేసింది డెబోరా. అయితే ఐదేళ్ల క్రితం ఒక పిల్లిని తెచ్చుకున్న డెబోరా.. ఆ పిల్లిపై ఎంతో ఇష్టం పెంచుకుంది.  ఈసారి కూడా అద్దె ఇంటి యజమాని విధించిన షరతు వల్ల పిల్లిని వదులుకోవాలి. కానీ డెబోరాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది.


అద్దె సమయంలో కుదుర్చుకున్న నియమనిబంధనలను ఒకసారి పరిశీలించింది. డెబోరా జీవిత భాగస్వామిగా ఉండే ఎవరైనా అద్దె ఇంటిలో ఉండొచ్చు అన్న నిబంధనను ఆమె తన పిల్లి కోసం వినియోగించుకుంది.


తాను ఎంతో ప్రేమగా చూసుకునే పిల్లిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని డెబోరా నిర్ణయించుకుంది. పెళ్లి అంటే తూతూ మంత్రం పెళ్లి కాదు. తన జీవిత భాగస్వామి పిల్లికి మంచి సూట్ తొడిగి, తాను కూడా మెరిసే కొత్త బట్టలు వేసుకొని, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఎంతో వైభవంగా క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి సందర్భంగా డెబోరాను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటూ ప్రీస్ట్ అడిగిన ప్రశ్నకు ‘మ్యావ్’ అంటూ పిల్లి సమాధానం కూడా ఇచ్చిందంటూ లండన్ పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి.


పెళ్లి అనంతరం..  ‘జీవితాంతం తామిద్దరం కలిసే ఉంటాం,..ఏ ఇంటి యజమాని పిల్లిని తిరస్కరించినా నేను కూడా బయటకు వెళ్లి పోతా. అవసరమైతే రోడ్లమీదైనా నివసిస్తా’ అంటూ డెబోరా పేర్కొంది. మరో విశేషమేమిటంటే ఆ పిల్లి పేరు ఇండియా.

Updated Date - 2022-05-01T08:12:55+05:30 IST