నెలసరి నలతా?.. ఈ టిప్స్ ఫాలో అవండి

ABN , First Publish Date - 2021-08-24T18:11:07+05:30 IST

పొత్తికడుపు నొప్పి, రొమ్ముల సలపరం లాంటి ఇబ్బందులు నెలసరి ముందు వేధిస్తున్నాయా? ఈ ‘ప్రి - మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌’ (పి.ఎమ్‌.ఎస్‌) లక్షణాలను వదిలించడం కోసం కొన్ని పదార్థాలను తప్పక తీసుకోవాలి.

నెలసరి నలతా?.. ఈ టిప్స్ ఫాలో అవండి

ఆంధ్రజ్యోతి (24-08-2021): పొత్తికడుపు నొప్పి, రొమ్ముల సలపరం లాంటి ఇబ్బందులు నెలసరి ముందు వేధిస్తున్నాయా? ఈ ‘ప్రి - మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌’ (పి.ఎమ్‌.ఎస్‌) లక్షణాలను వదిలించడం కోసం కొన్ని పదార్థాలను తప్పక తీసుకోవాలి.


రాత్రంతా నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్ష, కుంకుమపువ్వులను పరగడుపున తీసుకోవాలి.


ఉదయం, మధ్యాహ్నం, రాత్రి - మూడు పూటలా ఆహారంతో పాటు నెయ్యి తీసుకోవాలి.


నెలసరి సమయంలో వేధించే మలబద్ధకం వదలాలంటే గుప్పెడు జీడిపప్పు లేదా వేరుసెనగపప్పులను బెల్లంతో కలిపి తినాలి. 


రాత్రి భోజనంగా సగ్గుబియ్యం కిచిడీ, లేదా రాగి దోసెలు తినాలి.


పెసలు, అలసందలు, మినుములతో పాటు పెరుగును మధ్యాహ్న భోజనంలో చేర్చుకోవాలి.

Updated Date - 2021-08-24T18:11:07+05:30 IST