Viral Video: Amazon లో కుర్చీని ఆర్డర్ చేసిన మహిళ.. పార్శిల్‌ను ఓపెన్ చేసి చూస్తే కుర్చీతో పాటు లోపల కనిపించిన దాన్ని చూసి..
ABN , First Publish Date - 2022-06-19T01:37:29+05:30 IST
ఆ మహిళ అమెజాన్ ద్వారా కుర్చీ ఆర్డర్ చేసింది.. రెండ్రోజుల తర్వాత పార్శిల్ వచ్చింది..
ఆ మహిళ అమెజాన్ ద్వారా కుర్చీ ఆర్డర్ చేసింది.. రెండ్రోజుల తర్వాత పార్శిల్ వచ్చింది.. దానిని ఓపెన్ చేసి చూస్తే లోపల కుర్చీ ఉంది.. దానితో పాటు ఓ బ్లడ్ శాంపిల్ ట్యూబ్ కూడా ఉంది.. దానిని చూసి ఆ మహిళ షాకైంది.. ఎందుకంటే ఆ ట్యూబ్‌లో రక్తం కూడా ఉంది.. ఆ ఘటనను ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జెన్ బెగాకిస్ అనే పీహెచ్డీ విద్యార్థినికి ఈ అనుభవం ఎదురైంది.
ఇది కూడా చదవండి..
రోజుకు 30 బాటిళ్ల పెప్సీ తాగే అలవాటు.. 20 ఏళ్లుగా ఏడాదికి రూ.6.7 లక్షల ఖర్చు.. ప్రస్తుతం ఇతడి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..
`నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన లెదర్ చైర్‌తో పాటు బ్లడ్ కలెక్షన్ ట్యూబ్ కూడా వచ్చిందని చెబితే మీరు నమ్ముతారా?. దానిని చూసి నాకు ఎలా స్పందించాలో తెలియలేదు. చాలా గందరగోళానికి గురయ్యాన`ని బెగాకిస్ పేర్కొంది. కాగా, బెగాకిస్ చేసిన ట్వీట్‌ను 3,500 కంటే ఎక్కువ మంది రీట్వీట్ చేశారు. అలాగే 48,800 లైక్‌లు కొట్టారు. పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.