ఇంటికొచ్చిన పార్శిల్ చూసి మహిళ షాక్..పార్శిల్ తెరవగానే..

ABN , First Publish Date - 2021-03-02T03:19:35+05:30 IST

ఆన్‌లైన్‌లో వస్తువులను కొనేవారితో ఓసారి మాట్లాడి చూడండి..? ఒకదానికి ఆర్డరిస్తే మరో వస్తువు వచ్చిందని, పాడైన వస్తువులు వచ్చాయని బోలేడంత మంది కనిపిస్తారు. అయితే.. చైనాకు చెందిన ఓ మహిళ విషయంలో మరింత ఆశ్చర్యకరమైన విషయం జరిగింది.

ఇంటికొచ్చిన పార్శిల్ చూసి మహిళ షాక్..పార్శిల్ తెరవగానే..

బీజింగ్: ఆన్‌లైన్‌లో వస్తువులను కొనేవారితో ఓసారి మాట్లాడి చూడండి..? ఒకదానికి ఆర్డరిస్తే మరో వస్తువు వచ్చిందని, పాడైన వస్తువులు వచ్చాయని ఫిర్యాదు చేసే  వారు బోలేడంత మంది తారసపడతారు. అయితే.. చైనా మహిళ లియూ విషయంలో మరింత ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఈ కామర్స్ సంస్థలను కాదని ఆమె కొద్ది రోజుల క్రితం నేరుగా యాపిల్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను ఆర్డరిచ్చింది. ఆ తరువాత..డెలవరీ కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. ఇటీవల ఓ రోజు ఆమెకు డెలివరీ అందింది. దీంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన ఆమె ఫోన్ ప్యాకేజీని విప్పి చూడగా అందులో యాపిల్ జ్యూస్ కినిపించింది. దీంతో షాకైన ఆమె వెంటనే యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేసింది. అయితే..డెలివరీ బాయ్ తనకు నేరుగా పార్శిల్ ఇవ్వలేదని తనుంటున్న అపార్ట్‌మెంట్‌లోని తన లాకర్లో వదిలి వెళ్లాడని తెలిపింది. మహిళ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన యాపిల్ సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. పార్శీల్ డెలవరీ చేసిన కొరియర్ సంస్థ కూడా ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

Updated Date - 2021-03-02T03:19:35+05:30 IST