భర్తను ఫూల్ చేసిన భార్య.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2020-12-26T01:46:01+05:30 IST

ఓ మహిళ తన భర్తను ఫూల్ చేసి.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చే

భర్తను ఫూల్ చేసిన భార్య.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళ తన భర్తను ఫూల్ చేసి.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సమాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాల ప్రకారం.. లోసేనా అనే ఇన్‌స్ట్రాగ్రాం యూజర్.. ప్రాంక్ వీడియో కోసం తన గదిలో ఓ బెల్టును పాములా సెట్ చేసి, గదిలో ఏదో ఉందంటూ ఓ కేక వేస్తుంది. దీంతో ఆమె భర్త ఓ కత్తిని చేతిలో పట్టుకుని.. ఆగమేఘాల మీద గదిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం తన కాలు వద్దే ఉన్న బెల్ట్‌ను చూసి.. పామనుకుని భ్రమపడుతాడు. వెంటనే చేతిలో ఉన్న కత్తితో దానిపై దాడి చేసి.. భయంతో బయటికి పరుగులు తీస్తాడు. దీంతో లోసేనా పగలబడి నవ్వుతుంది. ఈ క్రమంలో అదేంటని ప్రశ్నించిన భర్తకు నిజం చెప్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను లోసేనా తన ఇన్‌స్ట్రాగ్రాం‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లను ఆ వీడియోను చూసి సరదాగా నవ్వుకుంటున్నారు. మరికొందరేమో.. నిజంగా పాము వచ్చినప్పుడు ఏం చేస్తావు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-12-26T01:46:01+05:30 IST