RCB Fan: సర్‌ప్రైజ్ అంటే ఇది పుష్పా.. మీమ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..

Published: Thu, 05 May 2022 14:38:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
RCB Fan: సర్‌ప్రైజ్ అంటే ఇది పుష్పా.. మీమ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..

ప్రేమను కొందరు మాటలతో వ్యక్తపరుస్తారు. మరికొందరు గులాబీ ఇచ్చి గుండెలో గూడుకట్టుకున్న భావనను తెలియజేస్తారు. ఇంకొందరు వేలికి ఉంగరం తొడిగి జీవితాంతం ఆ వేలు పట్టుకుని నడవాలని ఆశపడుతున్నట్లు ప్రపోజ్ చేస్తుంటారు. ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచినా ఆ ఇద్దరి మధ్య అదొక అందమైన క్షణంగా మాత్రమే ఆ సందర్భం ఉండేది. కానీ.. ఇప్పుడలా కాదు. మారిన కాలంతో పాటు ప్రపోజ్ చేసే పద్ధతి కూడా మారింది. అందరికీ తెలిసేలా, అందరి మధ్య ప్రపోజ్ చేయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఈ మధ్య కాలంలో అందుకు క్రికెట్ స్టేడియమ్స్ వేదికలుగా మారుతున్నాయి.


తాజాగా బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఇలాంటి లవ్ ప్రపోజల్ అందరి దృష్టినీ ఆకర్షించింది. RCB జెర్సీ ధరించిన ఓ యువకుడికి యువతి తన మనసులో దాచుకున్న ప్రేమను వ్యక్తపరిచింది. టీవీల్లో, హాట్‌స్టార్‌లో సీరియస్‌గా మ్యాచ్ వీక్షిస్తున్న వారికి కెమెరామెన్ కాస్తంత టెన్షన్ తగ్గించాలనుకున్నాడో ఏమో కానీ ఆ లవ్ ప్రపోజల్ వైపు కెమెరాను తిప్పి ఆ దృశ్యాలను అందరికీ చూపించాడు. ఆ RCB అభిమాని కూడా ఆ యువతి లవ్ ప్రపోజల్‌ను సంతోషంగా అంగీకరించడంతో సదరు ప్రేయసి ప్రియుడికి రింగ్ తొడిగింది.


CSK 11వ ఓవర్‌లో ఛేజింగ్ చేసేందుకు బ్యాటింగ్ ఆడుతున్న సందర్భంలో ఈ లవ్ ప్రపోజల్ అందరి దృష్టినీ ఆకర్షించింది. అమ్మాయికి అబ్బాయి మోకాలిపై కూర్చుని లవ్ ప్రపోజ్ చేయడంలో కొత్తేం లేకపోవచ్చు గానీ అబ్బాయికి అమ్మాయి మోకాలిపై కూర్చుని ప్రేమను వ్యక్తపరచడం మాత్రం చూసిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ యువకుడిని ఎంత ప్రేమించి ఉంటే ఆ యువతి అందరి ముందు బహిరంగంగా ఇలా ప్రేమను వ్యక్తపరిచి ఉంటుందోనని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఈ వీడియోపై మీమ్స్ వేసి వైరల్ చేస్తున్నారు. ఈ లవర్స్ ఇద్దరూ RCB అభిమానులే. ఈ ఇద్దరి మధ్య అదే ప్రేమ కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా లవ్ ప్రపోజల్స్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడూ కంటపడుతున్నాయి. ఇదిలా ఉండగా.. చెన్నైపై గెలుపుతో RCB జట్టు 4వ స్థానానికి ఎగబాకింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.