జాబ్‌కు గుడ్‌బై చెప్పిన యువతి.. కుక్కలా ప్రవర్తిస్తూ కోట్లు కూడబెట్టింది!

ABN , First Publish Date - 2022-01-09T18:20:14+05:30 IST

అప్పటి వరకూ ఆ యువతి జాబ్ చేస్తున్న యువతి.. అకస్మాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత కుక్కలా ప్రవర్తిస్తూ విధుల వెంట తిరుగుతుంటే ఈమెకు పిచ్చా అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె సంపాదన చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.

జాబ్‌కు గుడ్‌బై చెప్పిన యువతి.. కుక్కలా ప్రవర్తిస్తూ కోట్లు కూడబెట్టింది!

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ ఆ యువతి జాబ్ చేస్తున్న యువతి.. అకస్మాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత కుక్కలా ప్రవర్తిస్తూ విధుల వెంట తిరుగుతుంటే ఈమెకు పిచ్చా అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె సంపాదన చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. కళ్లు చెదిరే రీతిలో ఆమె ఏం చేస్తోంది? అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి.



ఆమె పేరు జెన్నా ఫిలిప్స్. సుమారు 30ఏళ్లలోపు వయసు ఉన్న ఈ యువతికి టిక్‌టాక్ వీడియోలు చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఓ రోజు కుక్కలా నటిస్తూ చిత్రీకరించిన వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇకపై కూడా ఇలాంటి వీడియోలను పోస్ట్  చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని ఫాలోవర్లు ఆమెను కోరారు. అవసరమైతే డబ్బులు కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో జెన్నా కీలక నిర్ణయం తీసుంది. అప్పటి వరకూ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. వీడియోల కోసం కుక్కలా నటిస్తూ వీధుల వెంబడి తిరింది. అది చూసి అంతా ముక్కన వేలేసుకున్నారు. ఈమెకు పిచ్చా.. జాబ్ వదిలేసి ఇలా చేస్తోందేంటి అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె సంపాదన చూసి, వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. కుక్కలా నటిస్తూ పోస్ట్ చేసిన వీడియోల ద్వారా జెన్నా ఇప్పటి వరకు సుమారు రూ.7కోట్లు సంపాదించిందని తెలుసుకుని కంగుతింటున్నారు. ఇదిలా ఉంటే.. జెన్నాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 




Updated Date - 2022-01-09T18:20:14+05:30 IST